Lishi Ghanesh : రాడిసన్ పబ్ డ్రగ్స్ కేసులో.. ఆ టాలీవుడ్ నటి సోదరి కూడా..

రాడిసన్ డ్రగ్స్ కేసులో కుషిత సోదరి, యూట్యూబర్ లిషి గణేష్‌ పేరును పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.

Lishi Ghanesh : రాడిసన్ పబ్ డ్రగ్స్ కేసులో.. ఆ టాలీవుడ్ నటి సోదరి కూడా..

Kushitha Kallapu Sister Lishi Ghanesh name enter in FIR Regarding Radisson Drugs Case

Updated On : February 27, 2024 / 10:24 AM IST

Lishi Ghanesh : రెండేళ్ల క్రితం హైదరాబాద్ లోని రాడిసన్ హోటల్ లో ఉన్న పబ్ లో డ్రగ్స్ వాడుతున్నారని తెలియడంతో పోలీసులు సోదాలు చేయగా పలువురు డ్రగ్స్ కేసులో పట్టుబడ్డారు. ఆ సమయంలో నిహారిక కొణిదెలతో పాటు పలువురు టాలీవుడ్, VIP పిల్లలు కూడా అదే పబ్ లో ఉండటంతో ఈ కేసు సంచలనంగా మారింది. ఆ కేసులో పలువురి పేర్లని చేర్చి విచారిస్తూనే ఉన్నారు.

తాజాగా రాడిసన్ డ్రగ్స్ కేసులో మరికొంతమంది పేర్లను కూడా FIR లో చేర్చారని పోలీసులు తెలిపారు. ఆ ఘటన జరిగిన సమయంలో కుషిత కళ్లపు అనే నటి మీద కూడా డ్రగ్స్ ఆరోపణలు వచ్చాయి. అయితే ఆమె.. మేము చీజ్ బజ్జిలు తినడానికి వెళ్ళాము, డ్రగ్స్ తో మాకు సంబంధం లేదు అని మాట్లాడటంతో బాగా వైరల్ అయింది. ప్రస్తుతం కుషిత హీరోయిన్ గా టాలీవుడ్ చిన్న సినిమాల్లో నటిస్తుంది.

Also Read : Dil Raju : మరోసారి నటిస్తున్న దిల్ రాజు.. ఆ హారర్ సినిమాలో..

ఇప్పుడు ఈ రాడిసన్ డ్రగ్స్ కేసులో కుషిత సోదరి, యూట్యూబర్ లిషి గణేష్‌ పేరును పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ఆ డ్రగ్స్‌ పార్టీకి లిషి గణేష్‌ కూడా వెళ్లినట్లు గుర్తించారు. లిషి గణేష్‌తోపాటు FIR లో మరో వీఐపీ శ్వేతా అనే అమ్మాయి పేరు కూడా చేర్చారు. లిషి గణేష్‌ను పిలిచి విచారిస్తామని తెలిపారు పోలీసులు. అలాగే ఈ కేసులో నిందితులుగా అరెస్ట్ అయిన కేదర్నాథ్, నిర్భయ్ లు సొంత పూచికత్తుపై బెయిల్ మీద నిన్న విడుదలయ్యారు. మరో నిందితుడు వివేకానందకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసారు.