O saathiya : లేడీ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ‘ఓ సాథియా’.. విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా మోషన్ పోస్టర్‌ విడుదల…

సినిమా పరిశ్రమలో లేడీ టెక్నీషియన్స్ ఉండటం చాలా అరుదు. అలాంటి ఓ సినిమాకు దర్శకురాలు, నిర్మాత మహిళలు కావడం విశేషం. అలా మహిళలిద్దరూ కలిసి తీసిన చిత్రమే ఓ సాథియా. తన్విక జశ్విక క్రియేషన్స్ బ్యానర్ మీద చందన కట్టా ఓ సాథియా అనే చిత్రాన్ని నిర్మిస్తుండగా.. దివ్యా భావన దర్శకత్వం...............

O saathiya : లేడీ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ‘ఓ సాథియా’.. విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా మోషన్ పోస్టర్‌ విడుదల…

lady director movie O saathiya motion poster released by writer vijayendraprasad

Updated On : January 13, 2023 / 2:41 PM IST

O saathiya :  సినిమా పరిశ్రమలో లేడీ టెక్నీషియన్స్ ఉండటం చాలా అరుదు. అలాంటి ఓ సినిమాకు దర్శకురాలు, నిర్మాత మహిళలు కావడం విశేషం. అలా మహిళలిద్దరూ కలిసి తీసిన చిత్రమే ఓ సాథియా. తన్విక జశ్విక క్రియేషన్స్ బ్యానర్ మీద చందన కట్టా ఓ సాథియా అనే చిత్రాన్ని నిర్మిస్తుండగా.. దివ్యా భావన దర్శకత్వం వహిస్తున్నారు.

ఓ సాథియా సినిమాలో ఆర్యన్ గౌర, మిష్టి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆర్యన్ గౌర.. అంతకు ముందు జీ జాంబీ అనే చిత్రం చేశారు. ఇప్పుడు ఆయన హీరోగా రెండో సినిమాగా ఓ సాథియా రాబోతోంది. రాజ్య సభ సభ్యుడు, లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఈ సినిమా నుంచి రీసెంట్‌గా విడుదల చేసిన ఫస్ట్ లుక్ అందరినీ మెప్పించింది.

Waltair Veerayya : వాల్తేరు వీరయ్య ఈ ఓటీటీలోనే వచ్చేది..

ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌కు ప్రస్తుతం యూట్యూబ్‌లో విశేషమైన స్పందన లభిస్తోంది. సంగీత దర్శకుడు విన్ను అందించిన మ్యూజిక్ ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఈజే వేణు సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు హైలెట్‌గా నిలవనుంది. ప్యూర్ లవ్ స్టోరీగా రాబోతోన్న ఈ సినిమా మీద ప్రస్తుతం మంచి బజ్ క్రియేట్ అయింది. ఓ సాథియా నుంచి త్వరలోనే ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయబోతున్నట్టుగా మేకర్లు ప్రకటించారు. సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ తాజాగా ఈ సినిమా నుంచి రెండో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రపోజింగ్ సూన్ ఇన్ థియేటర్స్ అంటూ త్వరలోనే థియేటర్స్ లోకి రాబోతుందని చెప్తూ సినిమాపై ఆసక్తి కలిగించారు.