Nivita : పవన్ కళ్యాణ్ కోసం క్లోజ్ రిలేటివ్ తో గొడవ పెట్టుకున్నా.. రోడ్ మీద కార్ దిగేసి వెళ్ళిపోయా..

ఆ సంఘటన తో నివిత సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయింది.

Nivita

Nivita ఇటీవల హరిహర వీరమల్లు సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ నివిత అనే నటిని పైకి పిలిచి మాట్లాడటం, ఆమె పవన్ ని పట్టుకొని ఫోటో దిగి సంతోషంలో స్టేజిపైనే గంతులేయడంతో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ సంఘటన తో నివిత సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయింది.

అనంతరం వరుసగా నివిత ఇంటర్వ్యూలు ఇస్తూ.. చిన్నప్పట్నుంచి పవన్ ఫ్యాన్ అని, పవన్ తో కలిసి నటించే అవకాశం రావడమే అదృష్టం అని, ఇలా పవన్ స్టేజిపై చెప్పడం ఇంకా గ్రేట్ అని పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంత ఇష్టమో చెప్పుకొచ్చింది.

Also Read : Raviteja : రవితేజ థియేటర్ రెడీ.. ఎక్కడో తెలుసా? విజయ్ దేవరకొండ సినిమాతోనే ఓపెనింగ్..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో నివిత మాట్లాడుతూ.. నేను పవన్ కళ్యాణ్ కి ఎంత అభిమానినో మా చుట్టాలందరికి తెలుసు. ఎవరన్నా పవన్ గురించి నెగిటివ్ గా మాట్లాడితే నేను వస్తే ఆపేస్తారు. ఒకసారి పవన్ కళ్యాణ్ కోసం నేను మా క్లోజ్ రిలేటివ్ తో గొడవ పడ్డాను. మా క్లోజ్ రిలేటివ్ తో కార్ లో వెళ్తుంటే పవన్ కళ్యాణ్ కి పాలిటిక్స్ ఎందుకు, సక్సెస్ అవ్వడు అంటూ మాట్లాడసాగింది. నాకు కోపం వచ్చి గొడవ పెట్టుకున్నా. అలా వెళ్తుంటే రోడ్ మీదే కార్ దిగేసి కోపంగా వెళ్ళిపోయా. తర్వాత ఈ విషయం మా ఇంట్లో తెలిసి నన్ను తిట్టారు అని తెలిపింది.

పవన్ ఫ్యాన్స్ ఈ లేడీ ఫ్యాన్ ని మరింత వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన నివిత పవన్ కళ్యాణ్ వల్ల వైరల్ అవగా మున్ముందు ఛాన్సులు ఇంకా వస్తాయేమో చూడాలి.

Also Read : Thank You Dear : థ్యాంక్యూ డియర్ ట్రైలర్ రిలీజ్.. హెబ్బా పటేల్ కొత్త సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే..