Miss Shetty Mr Polishetty : లేడి లక్ నువ్వే అంటూ.. అనుష్కను ఫాలో అవుతున్న నవీన్ పొలిశెట్టి
జాతి రత్నాలు ఫేమ్ నవీన్ పొలిశెట్టి(Naveen Polishetty), స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’.

Lady Luck Video Song
Miss Shetty Mr Polishetty : జాతి రత్నాలు ఫేమ్ నవీన్ పొలిశెట్టి(Naveen Polishetty), స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. పి.మహేష్ బాబు దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటుంది. యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాష బాషల్లో ఆగస్టు 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Samyuktha Hegde : నీ శరీరమే నీ ఆస్తి అంటూ టాప్ లెస్ వీడియో పోస్ట్.. చూస్తే మైండ్ బ్లాక్..!
ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. ఈ చిత్ర టీజర్, పోస్టర్లతో పాటు నో నో నో, హతవిధి పాటలకు మంచి స్పందన వచ్చింది. తాజాగా లేడి లక్ మొత్తం పాటను విడుదల చేసింది. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించగా, కార్తిక్ పాడారు. రధన్ అందించిన బాణీ ఎంతో క్యాచీగా ఉంది. ఇక వీడియో సాంగ్‌లో నవీన్ పొలిశెట్టి ఎనర్జీ, అనుష్క చార్మింగ్ లుక్స్ అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు ఓ సారి చూసేయండి.
Samyuktha Hegde : నీ శరీరమే నీ ఆస్తి అంటూ టాప్ లెస్ వీడియో పోస్ట్.. చూస్తే మైండ్ బ్లాక్..!