Lady Producers: హీరోయిన్స్‌గా సూపర్ సక్సెస్.. మరి నిర్మాతలుగా?
నిర్మాతలుగా మారిన హీరోయిన్లకు పరీక్షా కాలం ఎదురు కాబోతుంది. హీరోయిన్ గా అయితే పేరు సాధించారు కానీ ప్రొడ్యూసర్స్ గా డబ్బులు సంపాదిస్తారా..

Lady Producers
Lady Producers: నిర్మాతలుగా మారిన హీరోయిన్లకు పరీక్షా కాలం ఎదురు కాబోతుంది. హీరోయిన్ గా అయితే పేరు సాధించారు కానీ ప్రొడ్యూసర్స్ గా డబ్బులు సంపాదిస్తారా.. పెట్టింది పోగొట్టుకుంటారా అన్న క్వశ్చన్స్ ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీల్లో రైజ్ అవుతున్నాయి. వీళ్లకు ఆదర్శంగా కొంతమంది ముద్దుగుమ్మలైతే సూపర్ సక్సెస్ అయ్యారు.. మరిప్పుడీ న్యూ కమ్మర్స్ పరిస్థితి ఏంటన్నది కాలమే చెప్పాలి.
Akhanda Bulls: అఖండకే హైలెట్ ఈ గిత్తలు.. కృష్ణార్జునుల ప్రత్యేకతలివే!
నిత్యామీనన్.. న్యాచురల్ యాక్ట్రెస్ గా మంచిపేరుంది ఈ హీరోయిన్ కి. ఇప్పుడు ప్రొడ్యూసర్ గానూ జెండా ఎగిరేయాలనుకుంటోంది. డిసెంబర్ 4న స్కైలాబ్ తో థియేటర్స్ కి రాబోతుంది. ఈ మూవీలో నటించడంతో పాటూ నిత్యా.. నిర్మాణ బాధ్యతలను కూడా తీసుకుంది. ఫస్ట్ నుంచి ఫిల్మ్ మేకింగ్ పై ఇంట్రెస్ట్ చూపించే ఈమె.. మంచి సబ్జెక్ట్ కావడంతో స్కైలాబ్ కోసం డబ్బులు ఖర్చుచేసింది. చూస్తుంటే మూవీ ట్రైలర్ అట్రాక్టివ్ గానే ఉంది. ఓవైపు భీమ్లానాయక్ వంటి సినిమాల్లో నటిస్తూనే ఇలా మీడియం బడ్జెట్ సినిమాలకు ప్రొడ్యూస్ చేయాలనుకుంటోన్న నిత్యా ఫస్ట్ బోణీ ఎంత గిరాకీ తెచ్చుకుంటుందో త్వరలోనే తెలిసిపోతుంది.
Mahesh Babu: మహేష్ చేతికి మరో బ్రాండ్.. ఏడాదికి రూ.15 కోట్లు?
అవుట్ సైడర్స్ ఫిల్స్మ్ పేరుతో ఈ ఏడాదే తన ప్రొడక్షన్ హౌజ్ ను లాంచ్ చేసింది తాప్సీ. తనే లీడ్ రోల్ చేస్తున్న బ్లర్ అనే సినిమా.. తన ప్రొడక్షన్ హౌజ్ నుంచి వస్తోన్న ఫస్ట్ మూవీ. ఈ నిర్మణ సంస్థ కోసం సూపర్ 30, 83, పీకూ వంటి సినిమాలను ప్రొడ్యూస్ చేసిన ప్రంజల్ కంధియాతో కొలాబరేట్ అవుతోంది తాప్సీ. ఇక పై తన అవుట్ సైడర్స్ ఫిల్మ్స్ నుంచి యాక్టివ్ గా సినిమాలొస్తాయని చెప్తోంది. సమంతా హీరోయిన్ గా తాప్సీ నిర్మాణంలోనే ఎంట్రీ ఉంటుందన్న ప్రచారం ఆమధ్య జరిగింది. అయితే బ్లర్ సినిమా తర్వాత ప్రొడ్యూసర్ గా తాప్సీ భవిష్యత్తు ఏంటన్నది తేలిపోతుంది.
Bigg Boss 5: మళ్ళీ హౌస్‌లోకి రవి రీఎంట్రీ.. నిజమెంత?
నిర్మాతగా దీపికా పదుకొణే చాలా సినిమాలనే లైన్ లో పెట్టింది. కా ప్రొడక్షన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ బ్యానర్ నుంచి ఛపాక్ మూవీని తీసుకొచ్చింది. తానే హీరోయిన్ గా నటిస్తూ తెరకెక్కించిన ఛపాక్ తో మంచి హిట్ సాధించింది దీపికా. ఆ తర్వాత భర్త రణ్ వీర్ సింగ్ నటించిన 83 మూవీ కోసం వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా మారింది. తన నిర్మాణ సంస్థలోనే త్వరలో అమితాబ్ తో కలిసి హాలీవుడ్ హిట్ ది ఇంటర్న్ రీమేక్ లో నటించబోతుంది. అంతేకాదు అన్నింటికి మించి అన్న లెవెల్ లో ఏకంగా ఓ హాలీవుడ్ సినిమానే కా ప్రొడక్షన్స్ లో సెట్స్ పైకి తీసుకెళ్తోంది దీపికా. క్రాస్ కల్చరల్ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కబోయే ఆ మూవీ కోసం ఎస్ టి ఎక్స్ ఫిల్మ్స్ అనే ప్రొడక్షన్ హౌజ్ తో కలవబోతుంది.
OTT Films: బాలీవుడ్ సినిమాలపై ఓటీటీల స్పెషల్ ఇంట్రెస్ట్..!
ఇన్నాళ్లు హీరోయిన్ గా అదరగొడుతున్న కరీనా కపూర్.. ఇప్పుడు ప్రొడ్యూసర్ చెయిర్ లో కూర్చోవలనుకుంటోంది. అదీ మాక్సిమనమ్ హీరోయిన్స్ లాగా తానే నటిస్తోన్న సినిమాకి. డైరెక్టర్ హన్సల్ మెహతాతో కలిసి త్వరలోనే నిర్మాతగా ఓ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లబోతుంది కరీనా. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం.. అనుభవమున్న లేడీ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ తో ఆమె కొలాబరేట్ కానుంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఆమీర్ ఖాన్ హీరోగా వస్తోన్న లాల్ సింగ్ చద్ధా మాత్రమే ఉంది. కరణ్ జోహార్ డైరెక్టర్ గా కరీనాతో పాటూ రణ్ వీర్, ఆలియా, విక్కీ కౌశల్, జాన్వీ కపూర్ వంటి స్టార్ కాస్ట్ తో సినిమానైతే ప్రకటించాడు కానీ ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వట్లేదు. సో ముందు కరీనా నిర్మాతగా మారే హన్సల్ మెహతా ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతుంది.
Omicron: ఒమిక్రాన్ గురించి 1963లోనే సినిమా.. నిజమేంటంటే
కాజల్ కి కూడా సినిమా మేకింగ్ పై ఇంట్రెస్ట్ ఉంది. కా అంచే కాజల్ అగర్వాల్ ప్రొడక్షన్ పేరుతో ప్రపోజల్ కూడా ముందుకొచ్చింది. కానీ కొవిడ్ రావడం, కిచ్లూతో పెళ్లి కావడం..తర్వాత పరిస్థితుల కారణంగా ఫోకస్ చేయలేకపోయింది. కానీ యాపిల్ ట్రీ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోన్న మనుచరిత్రకు తను ప్రజెంటర్ గా మారింది. ఆ సినిమా త్వరలోనే రాబోతుంది. ఎటర్నల్ సన్ షైన్ పేరుతో అలియా భట్ కూడా ఈ ఏడాదే ప్రొడక్షన్ హౌజ్ ఓనర్ అనిపించుకుంది. నిజమున్న, సంతోషాన్ని పంచే కథలతో త్వరలోనే వస్తానని ప్రకటించింది.
Star Actress: ఈడా ఉంటాం.. ఆడా ఉంటాం.. ఎక్కడైనా ఒకే అంటున్న స్టార్ బ్యూటీస్!
లేడీ ప్రొడ్యూసర్ గా హీరోయిన్ ప్రియాంక చోప్రా సక్సెస్ అయిందనే చెప్పొచ్చు. పర్పుల్ పెబుల్ పిక్చర్స్ పేరుతో ఆమె సినిమాలను నిర్మిస్తోంది. ఒక్క హిందీలోనే కాకుండా మరాఠీ, భోజ్ పురి, అస్సామీ భాషలతో పాటూ హాలీవుడ్ లో కూడా ప్రియాంక నిర్మాణ సంస్థ నుంచి సినిమాలొస్తున్నాయి. ది స్కై ఈజ్ పింక్, ఎవిల్ ఐ, ది వైట్ టైగర్ ప్రాజెక్ట్స్ తో మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ గా ప్రియాంక గుర్తింపు తెచ్చుకుంది. త్వరలోనే ఆమె ప్రొడక్షన్ హౌజ్ నుంచి అన్ని భాషల్లో కలిపి దాదాపు 7 సినిమాలు రానున్నాయి.
Bollywood Hero’s: 30 at ఇండస్ట్రీ.. మూడు స్టెప్పులు దాటేసిన బాలీవుడ్ హీరోలు!
బాలీవుడ్ లో అనుష్కా శర్మ కూడా ప్రొడ్యూసర్ విజయాన్ని అందుకుంది. తమ్ముడు కర్ణేశ్ శర్మతో కలిసి 2013లోనే క్లీన్ స్లేట్ ఫిల్మ్స్ అనే ప్రొడక్షన్ హౌజ్ ను మొదలెట్టింది అనుష్కా. ఎన్ హెచ్ 10, ఫిల్లౌరీ, పారీ వంటి సినిమాల్లో నటించి వాటిని నిర్మించి సక్సెస్ టేస్ట్ చేసింది అనుష్కా. పాతాళ్ లోక్ వంటి క్రేజీ సిరీస్ ఈమె ప్రొడశక్షన్ హౌజ్ నుంచి వచ్చిందే. ప్రస్తుతం మై అనే సినిమాతో పాటూ ఇర్ఫాన్ ఖాన్ కొడుకు బాబిల్ ఖాన్ ను ఇంట్రడ్యూస్ చేస్తూ ఖాలా అనే ప్రాజెక్ట్ ను నెట్ ఫ్లిక్స్ కోసం నిర్మిస్తోంది.
OTT Release: ఒరిజినల్స్‌కు ఊపిరాడకుండా చేస్తున్న వెబ్ సిరీస్‌లు!
సౌత్ లో నయనతార లాంటి హీరోయిన్.. ప్రొడ్యూసర్ గా మంచి పేరు తెచ్చుకుంటోంది. బాయ్ ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్ తో కలిసి రౌడీ పిక్చర్స్ స్టార్ట్ చేసిన నయన్.. ఆ బ్యానర్ పై చిన్న సినిమాలను నిర్మిస్తోంది. హాట్ స్టార్ లో రిలీజైన నెట్రికన్ రౌజడీ పిక్చర్స్ నుంచి వచ్చిందే. అలాగే ఈమధ్యే ఆస్కార్ కోసం నామినేషన్ సాధించిన కూళంగల్ మూవీ కూడా నయన్, విఘ్నేశ్ నిర్మాతలుగా తెరకెక్కించిందే. త్వరలోనే వీళ్ల బ్యానర్ నుంచి ఊర్ కురువి, రాఖీ, కనెక్ట్ అనే సినిమాలు రాబోతున్నాయి. అశ్విన్ శరవణన్ డైరెక్ట్ చేస్తోన్న కనెక్ట్ హారర్ థ్రిల్లర్ లో నయన్ లీడ్ రోల్ చేస్తుంది కూడా.