OTT Films: బాలీవుడ్ సినిమాలపై ఓటీటీల స్పెషల్ ఇంట్రెస్ట్..!

ఓటీటీకి వచ్చేస్తోన్న సల్మాన్ మూవీ.. పావులు కదుపుతోన్న ఆహా.. ఫస్ట్ అప్ డేట్ ఇచ్చిన యశ్ రాజ్ ఫిల్మ్స్.. రిలీజైన మిన్నాల్ మురళీ సెకండ్ ట్రైలర్.. స్ట్రీమింగ్ అవుతోన్న అక్షయ్ కుమార్..

OTT Films: బాలీవుడ్ సినిమాలపై ఓటీటీల స్పెషల్ ఇంట్రెస్ట్..!

Ott Films

OTT Films: ఓటీటీకి వచ్చేస్తోన్న సల్మాన్ మూవీ.. పావులు కదుపుతోన్న ఆహా.. ఫస్ట్ అప్ డేట్ ఇచ్చిన యశ్ రాజ్ ఫిల్మ్స్.. రిలీజైన మిన్నాల్ మురళీ సెకండ్ ట్రైలర్.. స్ట్రీమింగ్ అవుతోన్న అక్షయ్ కుమార్ సూర్యవంశీ… ఇలా ఓటీటీ థియేటర్స్ కు ఛాలెంజ్ విసిరే స్థాయిలో ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది.

Omicron: ఒమిక్రాన్ గురించి 1963లోనే సినిమా.. నిజమేంటంటే

అంతిమ్-ది ఫైనల్ ట్రూత్ ఓటీటీ రిలీజ్ కి టైమ్ దగ్గరపడుతోంది. ఇప్పటికే నవంబర్ 16న రిలీజైన ఈ మూవీ థియేటర్స్ లో హల్చల్ చేస్తోంది. అయితే సల్మాన్ ఖాన్, ఆయన బావ ఆయుశ్ శర్మ నటించిన అంతిమ్ డిసెంబర్ 27న జీ5 ఓటీటీలో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. అప్పటికి నాలుగు వారాల విండో గ్యాప్ పూర్తవుతుంది. అలాగే డిసెంబర్ 27 సల్మాన్ భాయ్ బర్త్ డే. సో ఫ్యాన్స్ కి ఓటీటీ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు సల్మాన్. అయితే క్రిస్ మస్ సీజన్ ను క్యాష్ చేసుకోవాలని తొందరపడితే మాత్రం అంతిమ్ ది ఫైనల్ ట్రూత్ డిసెంబర్ 17న జీ5లో స్ట్రీమింగ్ అయినా ఆశ్చర్యం లేదు.

Katrina-Vicky: ఒక్కటవుతున్న క్యాట్-విక్కీ.. ప్రూఫ్స్ రివీల్!

చెప్పినట్టే యశ్ రాజ్ ఫిల్స్మ్ ఎంటర్ టైన్ మెంట్.. ఫస్ట్ ఓటీటీ ప్రాజెక్ట్ అప్ డేట్ వచ్చేసింది. ది రైల్వే మెన్ పేరుతో ఫస్ట్ వెబ్ సిరీస్ స్టార్ట్ అయినట్టు అనౌన్స్ చేసారు యశ్ రాజ్ ఫిల్మ్స్ మేకర్స్. 1984 డిసెంబర్ 2న జరిగిన ఘోర ప్రమాదం భోపాల్ గ్యాస్ లీక్ బ్యాక్ డ్రాప్ తో ఈ సిరీస్ తెరకెక్కుతోంది. మాధవన్, కెకె మీనన్, దివ్యేందు, బాబిల్ ఖాన్ లీడ్ రోల్స్ చేస్తున్నారిందులో. 2022 డిసెంబర్ 2న రిలీజ్ కాబోతున్న ది రైల్వే మెన్.. యశ్ రాజ్ ఎంటర్ టైన్ మెంట్ స్వంత ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందా.. వేరే ఓటీటీకి ఇచ్చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

Actor Srikanth: లెజెండ్‌తో జగపతి.. అఖండతో శ్రీకాంత్ దశ తిరిగేనా?

మిన్నాల్ మురళీ నుంచి సెకండ్ ట్రైలర్ వచ్చేసింది. మలయాళం నుంచి వస్తోన్న ఫస్ట్ సూపర్ హీరో ఫిల్మ్ కావడం.. అది గ్రాండ్ గా అన్ని మల్టీ లాంగ్వెజెస్ లో రిలీజ్ అవుతుండటంతో హైప్ క్రియేటైంది. డిసెంబర్ 24 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న ఈ మూవీపై నెట్ ఫ్లిక్స్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉంది. ఫస్ట్ ట్రైలర్ లో హీరో క్యారెక్టర్ ని ఎక్కువ ప్రొజెక్ట్ చేసిన టీమ్.. ఈసారి మురళీ ఊర్లోని భయంకర పరిస్థితులను చూపించింది.