Laggam Time : ‘లగ్గం టైమ్‌’ ఫస్ట్‌లుక్ లాంచ్.. భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతుల మీదుగా..

‘లగ్గం టైమ్‌’ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర రిలీజ్ చేసారు.

Laggam Time Movie First Look Released by Bhimla Nayak Director Sagar K Chandra

Laggam Time : కొత్త నిర్మాణ సంస్థ 20th సెంచరీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మాణంలో తెరకెక్కుతున్న మొదటి సినిమా ‘లగ్గం టైమ్‌’. రాజేష్ మేరు, నవ్య చిత్యాల మెయిన్ లీడ్స్ లో నటిస్తుండగా నెల్లూరు సుధర్శన్, ప్రీతి సుందర్, ప్రణీత్ రెడ్డి.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు ఈ సినిమాలో.

Also Read : Shiva Karthikeyan : మా నాన్న ఒక పోలిస్.. డ్యూటీలోనే చనిపోయారు.. శివ కార్తికేయన్ వ్యాఖ్యలు..

ప్రజోత్ కె వెన్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న లగ్గం టైం సినిమా నుండి తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని సమాచారం. ఆల్రెడీ మ్యూజిక్ రైట్స్ కూడా ఆదిత్య మ్యూజిక్ కొనుగోలు చేసిందని మూవీ యూనిట్ తెలిపారు.

‘లగ్గం టైమ్‌’ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర రిలీజ్ చేసారు. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని మూవీ యూనిట్ కి అల్ ది బెస్ట్ తెలిపారు. వివాహం నేపథ్యంలో హృదయాలను హత్తుకునే కథాంశంతో ఈ సినిమా రానుందని మూవీ యూనిట్ తెలిపారు.