లక్ష్మీ’స్ ఎన్టీఆర్: ఏపీలో విడుదల ఎప్పుడంటే?

ఏపీలో ఎన్నికల నేపధ్యంలో సంచలన దర్శకుడు రాంగోపాల్‌వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదల ఏపీలో ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఏపీలో పోలింగ్ పూర్తి కావడంతో మే 1వ తేదీన ఏపీలో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు. ఎన్టీఆర్ అనుభవించిన నరకం ఏపీ ప్రజలు తెలుసుకోబోతున్నారంటూ విడుదలకు సంబంధించిన పోస్టర్‌ను ట్విటర్‌లో విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ మినహా మిగతా అన్నీ ప్రాంతాల్లో మార్చి 29వ తేదీన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల అయింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు పూర్తయ్యే వరకు రిలీజ్‌పై హైకోర్టు స్టే విధించటంతో అప్పటినుంచి చిత్రయూనిట్ న్యాయ పోరాటం చేస్తుంది.
ఈ చిత్రాన్ని విడుదల చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ టీడీపీకి చెందిన న్యాయవాది సువ్వారి శ్రీనివాసరావు, ఆ పార్టీ నాయకుడు పి.మోహన్‌రావు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే అడ్డంకులు అన్నీ తీరయడంతో ఎట్టకేలకు ఈ సినిమా ఏపీలో కూడా విడుదల అవుతుంది.
Finally #LakshmisNTR is now releasing on MAY 1ST in ANDHRA PRADESH ..Come watch the conspiracies that happened behind NTR ‘s back pic.twitter.com/GWyFYj4OY0
— Ram Gopal Varma (@RGVzoomin) April 26, 2019