Lavanya Tripathi : పెళ్లి తర్వాత ‘స‌తీ లీలావ‌తి’గా మెగా కోడలు.. లావణ్య కొత్త మూవీ నుండి అప్డేట్..

నేడు లావ‌ణ్య త్రిపాఠి పుట్టిన రోజు. ఈ సందర్బంగా "స‌తీ లీలావ‌తి" పేరుతో సరికొత్త సినిమా అనౌన్స్ చేసింది.

Lavanya Tripathi announced her first movie after marriage

Lavanya Tripathi : మెగా కోడలు లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత ఏడాది మెగా హీరో వ‌రుణ్‌తేజ్‌తో ఏడ‌డుగులు వేసింది లావ‌ణ్య త్రిపాఠి. పెళ్లి తరువాత దాదాపుగా ఏడాది పాటు సినిమాలకి బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు పుంజుకుంటుంది. ఇక పెళ్లి ముందు వరకు పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ భామ పెళ్లి తరువాత సినిమాలను పూర్తిగా మానేస్తుందన్న పుకార్లు వచ్చాయి. తాజాగా వాటన్నిటికీ చెక్ పెడుతూ సరికొత్త సినిమా ప్రకటించింది లావ‌ణ్య త్రిపాఠి.

నేడు లావ‌ణ్య త్రిపాఠి పుట్టిన రోజు. ఈ సందర్బంగా “స‌తీ లీలావ‌తి” పేరుతో సరికొత్త సినిమా అనౌన్స్ చేసింది. కాగా లావణ్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ఈ సినిమాను దుర్గాదేవి పిక్చ‌ర్స్‌, ట్రియో స్టూడియోస్ ప‌తాకాల‌పై నాగమోహ‌న్ బాబు.ఎమ్‌, రాజేష్‌.టి నిర్మించ‌నున్నారు. ఇక పెళ్లి తరువాత మెగా కోడలు చేస్తున్న మొదటి సినిమా కావడంతో ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు ఆడియన్స్.

Also Read Anushka Ghati movie release date : అనుష్క ‘ఘాటి’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..

అయితే ఈ సినిమాలో లావ‌ణ్య త్రిపాఠి డిఫ‌రెంట్ రోల్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు వార్తలు వస్తున్నాయి. గత సినిమాలతో పోల్చుకుంటే ఇందులో లావణ్య చాలా డిఫరెంట్ గా కనిపిస్తుందట. త్వ‌ర‌లోనే ఈ మూవీకి సంబందించిన రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తారట మేకర్స్. అలాగే ఇత‌ర న‌టీన‌టుల ఎవ‌ర‌న్న‌ది త్వ‌ర‌లోనే రెవెల్ చేస్తారట.