Raghava Lawrence : బాబా సెహగల్‌కి స్టేజిపైనే బంపరాఫర్ ఇచ్చిన లారెన్స్ మాస్టర్..

తాజాగా బాబా సెహగల్‌ ఓ ఛానల్ కి సంబంధించిన దసరా ఈవెంట్ ప్రోగ్రాంకి వచ్చారు. ఈ ప్రోగ్రాంలో బాబా సెహగల్‌ తన పాటలతో అందర్నీ అలరించాడు.

Lawrence Master gives a Movie Chance to Baba Sehgal

Raghava Lawrence :  ఇండియన్ ర్యాప్ సింగర్ బాబా సెహగల్(Baba Sehgal) అందరికి తెలిసిందే. తన పాటలతో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ప్రేక్షకులని ఉర్రూతలూగించారు. రూపుతేరామస్తానా, జల్సా, గబ్బర్ సింగ్ లాంటి పలు సాంగ్స్ తో తెలుగులో కూడా బాగా పాపులర్ అయ్యారు బాబా సెహగల్. బాబా సెహగల్‌ పవన్ కళ్యాణ్ కి అభిమాని అని కూడా చెప్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ పై ఓ స్పెషల్ సాంగ్ రాసి కొన్నాళ్ల క్రితం బాగా వైరల్ అయ్యారు. ఇటీవల సింగర్ గా అవకాశాలు తగ్గినా బయట ప్రోగ్రామ్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు.

తాజాగా బాబా సెహగల్‌ ఓ ఛానల్ కి సంబంధించిన దసరా ఈవెంట్ ప్రోగ్రాంకి వచ్చారు. ఈ ప్రోగ్రాంలో బాబా సెహగల్‌ తన పాటలతో అందర్నీ అలరించాడు. అయితే ఇదే కార్యక్రమానికి లారెన్స్ మాస్టర్ కూడా వచ్చారు. బాబా సెహగల్‌ పాడిన పాటలకు లారెన్స్ మాస్టర్ స్టెప్పులేశారు. ఆయన్ని మెచ్చుకున్నారు. అంతేకాక లారెన్స్ మాస్టర్.. త్వరలో నా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. అందులో మీకు నటుడిగా ఛాన్స్ ఇస్తాను. మీరు నా సినిమాలో నటించాలని చెప్పాడు.

Also Read : Bigg Boss 7 Day 47 : చేతికి కట్టుతో శివాజీ.. నా వల్ల కావట్లేదు.. వెళ్ళిపోతానంటూ ఏడుపు..

ఇలా బాబా సెహగల్‌ కి ప్రోగ్రాంలో స్టేజిపైనే బంపర్ ఆఫర్ ఇచ్చారు లారెన్స్ మాస్టర్. దీని బాబా సెహగల్‌ కూడా సంతోషం వ్యక్తం చేశారు. బాబా సెహగల్‌ గతంలో కూడా పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించరు. మరి లారెన్స్ మాస్టర్ ఏ సినిమాలో బాబా సెహగల్‌ ని ఎలా చూపించబోతున్నారో చూడాలి.