Bigg Boss 7 Day 47 : చేతికి కట్టుతో శివాజీ.. నా వల్ల కావట్లేదు.. వెళ్ళిపోతానంటూ ఏడుపు..
ఎపిసోడ్ అంతా శివాజీ గురించే సాగింది. గతంలో ఇచ్చిన ఓ ఫిజికల్ టాస్క్ లో శివాజీ గాయపడగా అతన్ని బయటకి తీసుకొచ్చి చేతికి కట్టు వేశారు. దీంతో శివాజీ అలాగే ఆడుతున్నాడు.

Bigg Boss 7 Day 47 Highlights Shivaji Crying in front of Bigg Boss
Bigg Boss 7 Day 47 : బిగ్‌బాస్ హౌస్ లో ఏడో వారం కూడా పూర్తవొస్తుంది. మూడో కెప్టెన్ కోసం పోటీ పడుతున్నారు కంటెస్టెంట్స్. కంటెస్టెంట్స్ ని జిలేబి పురం, గులాబిపురం అని టీమ్స్ విడగొట్టి రెండు రోజులుగా టాస్కులు పెట్టారు. ఇందులో జిలేబీపురం కంటెస్టెంట్స్ గెలిచారు. వీరిలో ప్రియాంక, అర్జున్, సందీప్, ప్రశాంత్, అశ్విని, భోలే ఉండగా వీరు కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీ పడాలి. అయితే శివాజీ కూడా కెప్టెన్సీ టాస్క్ లో పోటీ చేయొచ్చు కానీ ఎవరో ఒకరు త్యాగం చేయాలి అంటే భోలే త్యాగం చేసి తన స్థానాన్ని శివాజీకి ఇచ్చాడు.
వీరిలో కొత్త కెప్టెన్ కోసం గులాబిపురం టీంకి టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. గులాబిపురం టీం వాళ్ళు నచ్చని వాళ్ళని కెప్టెన్సీ టాస్క్ నుంచి తప్పించొచ్చు అని బిగ్‌బాస్ చెప్పగా చివరికి అర్జున్, సందీప్ మిగిలారు. నేడు శనివారం ఎపిసోడ్ లో పోటీపడి వీరిలో ఎవరో ఒకరు కొత్త కెప్టెన్ అవుతారు.
Also Read : Bigg Boss 7 : ఈ వారం కూడా అమ్మాయే ఎలిమినేట్ కానుందా..?
ఇక ఎపిసోడ్ అంతా శివాజీ గురించే సాగింది. గతంలో ఇచ్చిన ఓ ఫిజికల్ టాస్క్ లో శివాజీ గాయపడగా అతన్ని బయటకి తీసుకొచ్చి చేతికి కట్టు వేశారు. దీంతో శివాజీ అలాగే ఆడుతున్నాడు. కెప్టెన్సీ టాస్క్ లో శివాజీని పక్కకి తప్పించడంతో బాధపడి ఎమోషనల్ అయ్యాడు. దీంతో బిగ్‌బాస్ దగ్గరికి వచ్చి.. నా వల్ల కావట్లేదు, నా శరీరం సహకరించట్లేదు. నేను ఆడటానికి, కప్పు కొట్టడానికి వచ్చాను. కానీ నేను వీళ్లకు వేస్ట్ గాడిలా కనిపిస్తున్నాను. వీళ్ళతో మాటలు పడలేకపోతున్నాను. బయట నవ్వుతూ ఉన్నా లోపల ఏడుస్తున్నాను. నేను వెళ్ళిపోతాను బిగ్‌బాస్ అంటూ ఏడ్చాడు. బిగ్‌బాస్ సింపుల్ గా చూద్దాం అని వదిలేశాడు. శివాజీ గాయపడినా, ఎప్పట్నుంచో వెళ్ళిపోతాను అని అంటున్నా బిగ్‌బాస్ శివాజీని ఎందుకు పంపించట్లేదో మరి.