‘లక్ష్మీ బాంబ్’ టైటిల్ మారింది!

  • Published By: sekhar ,Published On : October 29, 2020 / 04:48 PM IST
‘లక్ష్మీ బాంబ్’ టైటిల్ మారింది!

Updated On : October 29, 2020 / 4:52 PM IST

Laxmmi: బాలీవుడ్ స్టార్ హీరో Akshay Kumar నటించిన హారర్ కామెడీ చిత్రం ‘Laxmmi Bomb’.. తెలుగు, తమిళంలో మంచి విజయం సాధించిన ‘కాంచన’ హిందీ రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా మాతృకను రూపొందించిన దర్శకుడు Raghava Lawrence హిందీ పరిశ్రమకు పరిచయమవుతున్నారు.



Kiara Advani కథానాయిక. ఇటీవల విడుదల చేసిన ‘లక్ష్మీ బాంబ్’ ట్రైలర్‌, బుర్జ్ ఖలీఫా వీడియో సాంగ్‌కు మంచి స్పందన లభించింది. తాజాగా ‘లక్ష్మీ బాంబ్’ టైటిల్ మార్చారు. ఈ సినిమాకు ‘లక్ష్మీ’ అనే పేరు ఫిక్స్ చేసినట్లు మూవీ టీమ్ ప్రకటించారు.


దీపావళి కానుకగా నవంబర్ 9న హాట్‌స్టార్‌లో ‘లక్ష్మీ’ స్ట్రీమింగ్ కానుంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యూఏఈ వంటి దేశాలలో అదే రోజు వెండితెరపై విడుదలవుతోంది. కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్, షబీనా ఖాన్, తుషార్ కపూర్ కలిసి నిర్మించారు.

Laxmmi