Fighter : ఫైటర్ మూవీలో లిప్ లాక్ సీన్‌పై హృతిక్, దీపికకు లీగల్ నోటీసులు

ఫైటర్ సినిమా న్యాయపరమైన చిక్కుల్లో పడింది. హృతిక్, దీపిక మధ్య లిప్ లాక్ సీన్ వివాదాస్పదంగా మారింది.

Fighter

Fighter : సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్‌లో హృతిక్ రోషన్, దీపిక పదుకోన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఫైటర్’ న్యాయపరమైన చిక్కుల్లో పడింది. హృతిక్, దీపిక మధ్య లిప్ లాక్ సీన్ వివాదాస్పదంగా మారింది. ఎయిర్ ఫోర్స్ యూనిఫామ్‌లో ఉండి ముద్దు సీన్‌లో నటించడాన్ని వ్యతిరేకిస్తూ IAF అధికారి సౌమ్యదీప్ దాస్ ఫైటర్ టీమ్‌కి లీగల్ నోటీసులు పంపారు.

Vyuham : హమ్మయ్య ఆర్జీవీ ‘వ్యూహం’కు లైన్ క్లియర్.. వ్యూహం రిలీజ్ ఎప్పుడంటే?
హృతిక్ రోషన్, దీపిక పదుకోన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఫైటర్’ మూవీ జనవరి 25న విడుదలైంది. ఇందులో వీరిద్దరూ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్లుగా నటించారు. బాధ్యతాయుతమైన అధికారులుగా ఉన్న పాత్రల్లో నటించిన వీరిద్దరూ లిప్ లాక్ సీన్‌లో నటించడం ఇప్పుడు వివాదాస్పదమైంది. దీనిపై IAF అధికారి సౌమ్యదీప్ దాస్ తీవ్ర స్ధాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. టీమ్‌కి లీగల్ నోటీసులు జారీ చేసారు. శౌర్యాన్ని, పవిత్రతను ప్రదర్శించే సైనిక దుస్తుల్లో ఉండి లిప్ లాక్ సీన్‌లో నటించడం అంటే యూనిఫామ్ పవిత్రతను అగౌరపరచడమే కాకుండా భారత వైమానిక చట్టాన్ని ఉల్లంఘించడమేనని సౌమ్యదీప్ దాస్ తన నోటీసులో పేర్కొన్నారు.

Sharwanand Ram Charan : చరణ్ లాంటి ఫ్రెండ్ దొరకడం.. వాళ్ళ లాన్‌లో పడి దొర్లాడి.. శర్వానంద్ ఆసక్తికర వ్యాఖ్యలు..

అయితే, అన్ని వర్గాల నుండి ప్రశంసలు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద అధిక భారీ అంచనాలను అందుకోవడంలో కాస్త వెనకబడింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.302 కోట్లు వసూలు చేసింది. కాగా ఫైటర్ ఓటీటీ హక్కుల్ని ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ దక్కించుకుంది. మార్చి 29 నుండి స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలో అనిల్ కపూర్, కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్ నటించారు.