Vyuham : హమ్మయ్య ఆర్జీవీ ‘వ్యూహం’కు లైన్ క్లియర్.. వ్యూహం రిలీజ్ ఎప్పుడంటే?
కోర్టు సూచనలతో వ్యూహం సినిమాకి రెండో సారి సెన్సార్ పూర్తయింది. దీంతో వ్యూహం సినిమాకు అడ్డంకులు తొలగడంతో..

RGV Vyuham Movie Ready to Release announced New Date after Court Clearance
Vyuham Movie : ఆర్జీవీ(RGV) దర్శకత్వంలో వైఎస్ జగన్ బయోపిక్ అంటూ వ్యూహం, శపథం రెండు భాగాలుగా సినిమాలని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్జీవీ పొలిటికల్ సినిమాలంటే ఓ రేంజ్ లో ఏదో ఒక పొలిటికల్ లీడర్స్ కి, పార్టీలకు కౌంటర్లు వేస్తాడు. ఆల్రెడీ వ్యూహం సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ సినిమా నుంచి టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఆల్రెడీ రిలీజ్ అయి మంచి అంచనాలు నెలకొన్నాయి.
అయితే వ్యూహం సినిమా రిలీజ్ చేయొద్దని, మరోసారి సెన్సార్ చేయాలని, వ్యూహం సినిమాని బ్యాన్ చేయాలని పలువురు టిడిపి నాయకులు విమర్శలు చేశారు, కోర్టులో కేసు కూడా వేశారు. ఇప్పటికే పలుమార్లు వ్యూహం సినిమా రిలీజ్ వాయిదా పడగా తాజాగా కొత్త డేట్ ని ప్రకటించారు చిత్రయూనిట్.
కోర్టు సూచనలతో వ్యూహం సినిమాకి రెండో సారి సెన్సార్ పూర్తయింది. దీంతో వ్యూహం సినిమాకు అడ్డంకులు తొలగడంతో ఈ ఫిబ్రవరి 16న వ్యూహం సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇక వైఎస్ జగన్ బయోపిక్ గా నేడు యాత్ర 2 సినిమా కూడా థియేటర్స్ లో రిలీజయింది. యాత్ర 2 ఎమోషనల్ కంటెంట్ గా ప్రేక్షకులని మెప్పిస్తుంటే వ్యూహం ఎలా మెప్పిస్తుందో చూడాలి.