Sharwanand Ram Charan : చరణ్ లాంటి ఫ్రెండ్ దొరకడం.. వాళ్ళ లాన్‌లో పడి దొర్లాడి.. శర్వానంద్ ఆసక్తికర వ్యాఖ్యలు..

శర్వానంద్, రానా, రామ్ చరణ్ చిన్నప్పట్నుంచి ఫ్రెండ్స్ అని అందరికి తెలిసిందే. మనోజ్ కూడా చిన్నప్పటినుంచి వీరితో తిరిగాడు.

Sharwanand Ram Charan : చరణ్ లాంటి ఫ్రెండ్ దొరకడం.. వాళ్ళ లాన్‌లో పడి దొర్లాడి.. శర్వానంద్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Sharwanand Interesting Comments on Ram Charan in Ustaad Show

Updated On : February 8, 2024 / 3:25 PM IST

Sharwanand Ram Charan : మంచు మనోజ్(Manchu Manoj) యాంకర్ గా ఈ విన్ యాప్ లో ఉస్తాద్(Ustaad) అనే షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 8 ఎపిసోడ్స్ గా రానా, రవితేజ, తేజ సజ్జ.. ఇలా పలువురు సినీ సెలబ్రిటీలు వచ్చి ఉస్తాద్ షోలో సందడి చేస్తూ బోలెడన్ని ఆసక్తికర విషయాలు చెప్తున్నారు. తాజాగా హీరో శర్వానంద్ ఉస్తాద్ షోకి వచ్చాడు. శర్వానంద్ ఎపిసోడ్ ప్రోమోని తాజాగా రిలీజ్ చేయగా ఇందులో చరణ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

శర్వానంద్, రానా, రామ్ చరణ్ చిన్నప్పట్నుంచి ఫ్రెండ్స్ అని అందరికి తెలిసిందే. మనోజ్ కూడా చిన్నప్పటినుంచి వీరితో తిరిగాడు. తాజాగా శర్వానంద్ ఉస్తాద్ షోలోకి రాగా.. స్క్రీన్ పై శర్వానంద్, చిరంజీవి, రామ్ చరణ్ ఉన్న ఫోటో వేసాడు మనోజ్. ఆ ఫోటోని చూసి.. చరణ్ లాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం అని అన్నాడు.

Also Read : Family Star : ఐరనే వంచాలేంటి.. జుట్టు దువ్వుకున్నా సరిపోదు.. ఫ్యామిలీ స్టార్ ఏం చేస్తున్నా వైరలే..

అలాగే ఆ ఫోటో చిరంజీవి ఇంటి లాన్ లో తీసింది కావడంతో ఆ లాన్ లో మనం చేసిన పనులు గుర్తున్నాయా అని సరదాగా మనోజ్ అడగడంతో.. అలాంటివి చెప్పకు అని శర్వానంద్ అన్నాడు. అయితే ముగ్గురు కలిసి ఆ లాన్ లో పడి దొర్లాడినట్టు మనోజ్ తెలిపాడు. ఇంకా అక్కడ ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి బోలెడన్ని చిలిపి పనులు చేసారని తెలిపాడు. దీంతో శర్వా – చరణ్ ఫ్రెండ్షిప్ తో పాటు మనోజ్ కూడా వీరితో చిన్నప్పుడు ఫుల్ గా ఎంజాయ్ చేసినట్టు తెలుస్తుంది.