Mike Tyson : ‘లైగర్’ కోసం బాక్సింగ్ లెజెండ్..

విజయ్ దేవరకొండ - పూరి జగన్నాథ్ కలయికలో వస్తున్న ‘లైగర్’ సినిమాలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ నటిస్తున్నారు..

Mike Tyson : ‘లైగర్’ కోసం బాక్సింగ్ లెజెండ్..

Mike Tyson

Updated On : November 21, 2021 / 5:37 PM IST

Mike Tyson: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం.. ‘లైగర్’ (సాలా క్రాస్ బ్రీడ్)..

Balayya : ‘లైగర్’ సెట్‌లో ‘లయన్’..

పూరి కనెక్ట్స్ బ్యానర్ మీద ఛార్మీ, పూరి కలిసి నిర్మిస్తుండగా.. బాలీవుడ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ కూడా నిర్మాణంలో భాగస్వాములయ్యారు. పాండమిక్ తర్వాత ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పున:ప్రారంభమైంది. ప్రస్తుతం గోవాలో నెల రోజుల పాటు షెడ్యూల్ ప్లాన్ చేశారు.

సెప్టెంబర్ 28న పూరి పుట్టినరోజు సందర్భంగా ‘లైగర్’ సినిమాకి సంబంధించి సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు. అమెరికన్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ‘లైగర్’ సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించారు. కిక్ బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీలకమైన సీన్స్‌లో రియల్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ స్టార్ నటిస్తే బాగుంటుందని టైసన్‌ను కాంటాక్ట్ అవగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయన రాకతో ‘లైగర్’ రేంజ్ మరింత పెరిగింది.