Lobo
Lobo : సోషల్ మీడియా నుంచి పాపులారిటీ తెచ్చుకున్న లోబో తర్వాత నటుడిగా మారాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో పాల్గొని ఫేమ్ తెచ్చుకున్నాడు. అనంతరం లోబో పలు సినిమాలు, టీవీ షోలు చేస్తూనే టాటూ షాప్స్ నడిపిస్తున్నాడు. తాజాగా జనగామ కోర్ట్ లోబోకు ఏడాది జైలు శిక్ష విధించింది.(Lobo)
వివరాల్లోకి వెళితే..
2018 లో లోబో, మరికొంతమంది ఓ ఛానల్ తరపున వరంగల్ రామప్ప, లక్నవరం, భద్రకాళి చెరువు, వేయిస్తంభాల ఆలయం.. పలు పర్యాటక ప్రాంతాలను వీడియో షూట్ చేయడానికి వెళ్లారు. వరంగల్ నుంచి హైదరాబాద్ కి తిరిగి వస్తుండగా రఘునాథపల్లి నిడిగొండ వద్ద ఎదురుగా వచ్చిన ఆటోను ఢీకొట్టారు. అప్పుడు లోబో స్వయంగా కార్ నడుపుతున్నాడు.
Also Read : Arjun Chakravarthy : ‘అర్జున్ చక్రవర్తి’ మూవీ రివ్యూ.. కబడ్డీ ఆట బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ కథ..
ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఇద్దరు మేడె కుమార్, పెంబర్తి మణెమ్మలు మృతి చెందారు. మిగిలిన వారికి, కార్ లో ఉన్న వారికి కూడా గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబ సభ్యులు లోబోపై కేసు నమోదు చేసారు. అప్పట్నుంచి ఈ కేసు కొనసాగగా తాజాగా నిన్న గురువారం నాడు జనగామ కోర్టు ఈ కేసులో తీర్పు ఇచ్చింది.
ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మరణానానికి, పలువురు గాయపడటానికి కారణమైన నటుడు ఖయూమ్ అలియాస్ లోబోకు ఏడాది జైలు శిక్షతో పాటు 12,500 రూపాయలు జరిమానా విధిస్తూ జనగామ కోర్టు తీర్పునిచ్చింది.
Also Read : Tribanadhari Barbarik : ‘త్రిబాణధారి బార్బరిక్’ మూవీ రివ్యూ.. మహాభారతం పాత్రకు ఇప్పటి క్రైమ్ ని లింక్ చేసి..