Prabhas – Ram Charan : ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తున్న దర్శకులు పేరులు రాజమౌళి, ప్రశాంత్ నీల్, లోకేష్ కనగరాజ్. హీరోలతో సమానంగా వీరి ముగ్గురు ఫేమ్ ని సంపాదించుకున్నారు. దీంతో వీళ్ళతో కూడా సినిమాకి మార్కెట్ జరుగుతుంది. ప్రస్తుతం వీరి లైనప్స్ పై ఎంతో ఆసక్తి నెలకుంది. ఇక లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) విషయానికి వస్తే.. ప్రెజెంట్ విజయ్ తో ‘లియో’ తెరకెక్కిస్తున్నాడు. ఆ తరువాత రజినీకాంత్ ఒక సినిమా ఉంది. అలాగే పాన్ ఇండియా స్టార్స్ అయినా ప్రభాస్ అండ్ రామ్ చరణ్ లతో కూడా సినిమాలు ఉన్నాయి.
Kamal Haasan : ‘ప్రాజెక్ట్ K’లో కమల్ హాసన్.. పారితోషికం అన్ని కోట్లా..?
తాజాగా వీటి గురించి లోకేష్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ప్రభాస్ గత 3 ఏళ్ళ నుంచి టచ్ లో ఉంటూ వస్తున్నాడట. ప్రభాస్ కి ఆల్రెడీ ఒక స్టోరీ చెప్పినట్లు, ఆ ప్రాజెక్ట్ తమ ఇద్దరి కెరీర్ లో బెస్ట్ గా ఉండబోతుందని చెప్పి అభిమానుల్లో అంచనాలు క్రియేట్ చేశాడు. అలాగే రామ్ చరణ్ తో కూడా కొన్నాళ్ల నుంచి టచ్ లో ఉంటూ వస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ప్రభాస్ అండ్ చరణ్ వాళ్ళ లైనప్స్ తో బిజీగా ఉన్నారని, తాను కూడా తన లైనప్స్ తో బిజీ ఉన్నాడని తెలియజేసిన లోకేష్.. వారిద్దరితో చిత్రాలు మాత్రం రైట్ టైంలో ఆడియన్స్ ముందుకు వస్తాయని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Mahesh Babu : కొత్త కారు కొన్న మహేష్ బాబు.. దాని ధర ఎంతో తెలుసా..?
#Prabhas × #LokeshKanagaraj ???
Something Blast Is Cooking ??pic.twitter.com/Td2nuFXYNY— ? ? ? ? ? ? ? (@Vattimallavish) June 24, 2023
ఇక లోకేష్ తెరకెక్కిస్తున్న లియో విషయానికి వస్తే.. ఈ సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రాబోతుంది. విక్రమ్, ఖైదీ సినిమాలను కనెక్ట్ చేస్తూ ఈ మూవీ స్టోరీ ఉండబోతుంది. ఈ చిత్రం హీరోయిన్ గా త్రిష నటిస్తుంటే సంజయ్ దత్ విలన్ గా కనిపించబోతున్నాడు. అనిరుద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. దసరా కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.