Elumalai : మంగ్లీ పాడిన ‘కాపాడు దేవా..’ ఎమోషనల్ సాంగ్.. ‘ఏలుమలై’ సినిమా నుంచి రిలీజ్..
తాజాగా ఈ సినిమా నుంచి ఓ లవ్ ఎమోషనల్ సాంగ్ ని రిలీజ్ చేసారు.

Elumalai
Elumalai : హీరోయిన్ రక్షిత సోదరుడు రాన్నా హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కుతున్న సినిమా ఏలుమలై. రాన్నా, ప్రియాంక ఆచార్ జంటగా జగపతి బాబు కీలక పాత్రలో తరుణ్ కిషోర్ సుధీర్ నిర్మాణంలో పునీత్ రంగస్వామి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. నరసింహా నాయక్ సమర్పణలో తరుణ్ సుధీర్ క్రియేటివ్స్, డీఈ ఆర్ట్ స్టూడియోస్ బ్యానర్లపై యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
తాజాగా సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి ఈ సినిమా నుంచి ఓ లవ్ ఎమోషనల్ సాంగ్ ని రిలీజ్ చేసారు. డి. ఇమ్మాన్ సంగీత దర్శకత్వంలో కాసర్ల శ్యామ్ ఈ పాటను రాయగా సింగర్ మంగ్లీ మాడింది. మీరు కూడా ఈ సాంగ్ ని వినేయండి..
Also Read : Upasana : రామ్ చరణ్ కి ఉపాసన పెట్టిన లవ్ టెస్ట్ ఇదే అంట.. డేటింగ్ లో ఉన్నప్పుడు అక్కడికి తీసుకెళ్లమని..
కర్ణాటక-తమిళనాడు సరిహద్దులోని చామరాజనగర్, సేలం, ఈరోడ్ లాంటి ప్రదేశాలలో ఈ మూవీ షూటింగ్ చేసారు. త్వరలో తమిళ్, తెలుగు, కన్నడ భాషలలో ఒకేసారి ఈ సినిమా రిలీజ్ కానుంది.