Sonu Sood: షాకింగ్‌.. సినీ నటుడు సోనూసూద్‌కు అరెస్టు వారెంట్‌ జారీ చేసిన కోర్టు.. ఎందుకంటే?

లుథియానా కోర్టు నుంచి సినీనటుడు సోనుసూద్‌కు అరెస్ట్‌ వారెంట్‌ జారీ అయింది.

Sonu Sood: షాకింగ్‌.. సినీ నటుడు సోనూసూద్‌కు అరెస్టు వారెంట్‌ జారీ చేసిన కోర్టు.. ఎందుకంటే?

Sonu Sood

Updated On : February 7, 2025 / 8:55 AM IST

పంజాబ్‌లోని లుథియానా కోర్టు నుంచి సినీనటుడు సోనుసూద్‌కు అరెస్ట్‌ వారెంట్‌ జారీ అయింది. ఓ కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి సోనూసూద్‌ రాకపోవడంతో ముంబైలోనిఒషివారా పీఎస్‌కు లుథియానా జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్ రమన్‌ప్రీత్‌ కౌర్‌ ఈ వారెంట్‌ జారీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సోనూసూద్‌ను అరెస్టు చేసి, న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలని ఆదేశించారు.

మోహిత్‌ శర్మ అనే వ్యక్తి తనను రూ.10 లక్షల మోసానికి గురి చేశాడని లుథియానాలోని లాయర్‌ రాజేశ్‌ ఖన్నా న్యాయస్థానంలో కేసు వేశారు. రిజికా కాయిన్‌ పేరుతో ఇన్వెస్ట్‌మెంట్‌ చేయించి, ఈ మోసానికి పాల్పడ్డాడని, దీనికి సోనూసూద్‌ సాక్షి అని చెప్పారు. దీనిపై న్యాయస్థానం వాంగ్మూలం ఇవ్వాలని పలుసార్లు సోనూసూద్‌కు సమన్లు పంపింది.

iPhone SE 4: శుభవార్త.. ఇక రెడీగా ఉండండి.. ఐఫోన్ ఎస్‌ఈ4 వచ్చేస్తోంది.. ధర ఇంత తక్కువా?

అయినప్పటికీ న్యాయస్థానానికి సోనూసూద్‌ రాలేదు. దీంతో ఆయనకు నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేస్తున్నట్లు మేజిస్ట్రేట్‌ చెప్పారు. సోనూసూద్‌ను అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలని అన్నారు. ఫిబ్రవరి 10న ఈ కేసు న్యాయస్థానంలో మరోసారి విచారణకు వస్తుంది.

కాగా, పాన్ ఇండియా వ్యాప్తంగా రాణిస్తున్న సోనూసూద్‌ పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ రియల్‌ హీరో అనిపించుకున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందిన సమయంలో చాలా మందికి సాయం చేశారు. ప్రస్తుతం సినిమాల్లో బిజీబిజీగా ఉన్నారు.