Manchu Vishnu : మోహన్ బాబు, మంత్రి పేర్నినాని మీటింగ్ పై మంచు విష్ణు ట్వీట్
మంత్రి పేర్నినాని.. మోహన్ బాబు ఇంటికి వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వారిద్దరూ ఏం చర్చిస్తున్నారనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Vishnu Tweet (1)
Manchu Vishnu tweeted : మోహన్ బాబు, ఏపీ మంత్రి పేర్నినాని మీటింగ్ పై మా అధ్యక్షులు మంచు విష్ణు ట్వీట్ చేశారు. ‘ఈ రోజు మా ఇంట్లో మీకు ఆతిథ్యం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. టిక్కెట్ ధరలపై మీ చొరవకు ధన్యవాదాలు. పరిశ్రమ కోసం ఏపీ ప్రభుత్వ ప్లాన్ లపై మాకు అప్ డేట్ చేసినందుకు ధన్యావాదాలు. టీఎఫ్ఐ ప్రయోజనాలను కాపాడినందుకు చాలా ధన్యవాదాలు’ అంటూ మంచు విష్ణు ట్వీట్ చేశారు. మంత్రి పేర్నినాని.. మోహన్ బాబు ఇంటికి వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వారిద్దరూ ఏం చర్చిస్తున్నారనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. టాలీవుడ్ సమస్యలకు శుభం కార్డు పడిందనుకుంటున్న సమయంలో కొత్త ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి.
మెగా మీటింగ్ సక్సెస్ అని ప్రకటించిన వేళ…మరిన్ని మీటింగ్స్ సీఎంతో సినీ పెద్దల మీటింగ్ పై కౌంటర్స్ తో సినీ ఇండస్ట్రీ మరోసారి హాట్ హాట్ గా మారింది. పేర్నినాని పర్సనల్ మీటింగ్, పొలిటికల్ కామెంట్స్, సెటైరికల్ ట్వీట్స్ తో ఫిల్మ్ నగర్ లో ఏం జరుగుతుందోనన్న అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. నిన్న చిరంజీవి టీమ్ సీఎం జగన్ ను కలిసి ఇండస్ట్రీ సమస్యలపై చర్చించారు. నిన్న సీఎం జగన్ తో చిరు టీమ్ మీటింగ్ లో జరిగిన విశేషాలను మోహన్ బాబుతో చర్చించినట్లుగా తెలుస్తోంది. మోహన్ బాబు ఇంట్లో దాదాపు 15 నిమిషాల పాటు సమావేశం జరిగింది. ఈ భేటీలో నిన్నటి సమావేశంలో చర్చించిన పలు అంశాలను కూడా వివరించినట్లుగా సమాచారం. అయితే దీనిపై మంచు విష్ణు కూడా ట్వీట్ చేశారు.
Pawan Kalyan: ఉద్యోగాలు, ఉపాధి కల్పన అంటే “సలహాదారు పోస్టులు” ఇచ్చుకోవడం కాదు: పవన్
నిన్న తెలుగు సినిమా ప్రముఖులతో ఇవాళ క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ భేటీ అయ్యారు. సినీ ప్రముఖులు చిరంజీవి, మహేష్‌బాబు, ప్రభాస్, రాజమౌళి, అలీ, ఆర్.నారాయణమూర్తి, పోసాని కృష్ణమురళి, కొరటాల శివ, నిరంజన్ రెడ్డి, మహి రాఘవ, ఐ అండ్ పీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, ఐఅండ్ పీఆర్ కమిషనర్, ఎఫ్‌డిసీ ఎండీ టి విజయ్‌కుమార్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
అనంతరం ఏపీ సీఎం జగన్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మంచి పాలసీ తీసుకువచ్చే దిశగా కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. అందరికీ న్యాయం జరిగేలా మంచి రేట్లు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. భారీ బడ్జెట్ సినిమాలను ప్రత్యేకంగా ట్రీట్ చేయాలన్న జగన్… భారీ బడ్జెట్ సినిమాలకు ప్రత్యేక ధరలు నోటిఫై చేస్తామని ఇవాళ జరిగిన చర్చల్లో సినీ పరిశ్రమ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. ఏపీలో షూటింగ్‌లు జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో కనీసం 20శాతం షూటింగ్ జరగాలన్నారు.
CM KCR. : కరవు తాండవించే జనగామ ఇప్పుడు అభివృద్ధి చెందింది : సీఎం కేసీఆర్
అందరికీ ఒకటే రేట్లు… ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయం అందరికీ మంచిదన్నారు. ప్రేక్షకులకు భారం కాకుండా, పరిశ్రమకు మంచి జరిగేలా టికెట్ రేట్లు ఉండాలన్నారు. ఐదో ఆట వల్ల ఇండస్ట్రీకి మేలు జరుగుతుందన్నారు. సిని పరిశ్రమ నెమ్మదిగా విశాఖకు రావాలని కోరారు. అందరికీ విశాఖపట్నంలో స్థలాలు ఇస్తామని చెప్పారు. స్టూడియోలు పెట్టే ఆసక్తి చూపిస్తే వారికి విశాఖలో స్థలాలు ఇస్తామన్నారు. విశాఖలో జూబ్లిహిల్స్ తరహా ప్రాంతాన్ని క్రియేట్ చేద్దామని చెప్పారు.
తెలంగాణతో పోలిస్తే సినీ పరిశ్రమకు ఆంధ్రా ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తోందన్నారు. ఏపీలో జనాభా, థిటయేటర్లు ఎక్కువ..ఆదాయం కూడా ఎక్కువేనని తెలిపారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లో విశాఖ పోటీ పడగలదన్నారు. రాజమౌళి మంచి సినిమాలు, పెద్ద సినిమాలు తీయాలని కోరారు. చిన్న సినిమాలను కూడా రక్షించుకోవాలన్నారు. సినీ పరిశ్రమ నుంచే దీనికి తగిన కార్యాచరణ ఉండాలని ప్రకటించారు. టికెట్ రేట్లకు సంబంధించి అందరికీ ఒకే రేట్లు అని చెప్పారు. ఆన్ లైన్ పద్ధతిలో టికెట్ల విక్రయం ప్రభుత్వానికి మంచిదని అభిప్రాయపడ్డారు.
Reliance Jio New Plans : జియో యూజర్లకు అలర్ట్.. ప్రీపెయిడ్ ప్లాన్ ధరలు మారాయి.. చెక్ చేసుకోండి..!
అలాగే సినిమా టికెట్లు, థియేటర్లలో షోలపై ఏపీ ప్రభుత్వానికి కమిటీ నివేదికను అందజేసింది. చిరు టీమ్‌తో మీటింగ్ సందర్భంగా ప్రభుత్వం.. కమిటీ ప్రతిపాదనలను వారి ముందు ఉంచింది. ఆ ప్రతిపాదనలకు ప్రభుత్వం, చిరు టీమ్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. టికెట్ రేట్లపై కమిటీ కీలక ప్రతిపాదనలు చేసింది. మున్సిపల్ కార్పొరేషన్లలలో నాన్ ఏసీ టికెట్ మినిమం ధర 40 రూపాయల నుంచి 60రూపాయలకు పెంచాలని ప్రతిపాదించింది. ఏసీ టికెట్ కనీస ధర 70నుంచి 100రూపాయలకు పెంచాలని సూచించింది. మున్సిపల్ కార్పొరేషన్, మల్టీప్లెక్స్‌లు, నగర పంచాయితీల్లోనూ టికెట్ల ధరలపై కమిటీ ప్రతిపాదనలు చేసింది.
మల్టీప్లెక్స్‌ల్లో గరిష్ట ధర రూ.250గా ప్రతిపాదించింది. నగర పంచాయతీల్లో నాన్ ఏసీ టికెట్ రూ.20నుంచి రూ.40కి పెంచాలని సూచించింది. నగర పంచాయతీల్లో ఏసీ టికెట్ రూ.50 నుంచి రూ.70కి పెంచాలని కోరింది. నగర పంచాయతీల్లోని మల్టీప్లెక్స్‌ల్లో గరిష్ట ధర రూ.250గా ప్రతిపాదన చేసింది. అలాగే.. ఏపీలో ఐదు షోల సమయాన్ని కూడా కమిటీ ప్రతిపాదించింది. మొదటి షో ఉదయం 8 నుంచి 11గంటల వరకు. రెండవ షో 11గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు. మూడవ షో మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు. నాల్గవ షో సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 8గంటల వరకు. ఐదవ షో రాత్రి 8 నుంచి రాత్రి 11గంటల వరకు అని ప్రతిపాదనలు చేసింది.
It was a absolute pleasure hosting you at our home Sri. Nani garu. Much thanks for protecting the interests of TFI ? pic.twitter.com/HjV3pK8yYJ
— Vishnu Manchu (@iVishnuManchu) February 11, 2022