Maanaadu Trailer : శింబు అదరగొట్టేశాడు..

శిలంబరసన్ శింబు, కళ్యాణి ప్రియదర్శన్ నటిస్తున్న ‘మానాడు’ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది..

Maanaadu Trailer : శింబు అదరగొట్టేశాడు..

Maanaadu Trailer

Updated On : October 2, 2021 / 12:11 PM IST

Maanaadu Trailer: శిలంబరసన్ శింబు కథానాయకుడిగా.. ‘గోవా’, ‘సరోజ’, ‘గ్యాంబ్లర్’, ‘బిర్యాని’, ‘రాక్షసుడు’ వంటి విభిన్నమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న సినిమా.. ‘మానాడు’.. కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటిస్తుండగా.. దర్శకుడు ఎస్.జె.సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు.

Simbu: డెడికేషన్ అంటే ఇదే.. బక్కచిక్కిన శింబు ఫోటో వైరల్!

ఈ సినిమాను ‘రీవైన్డ్’ పేరుతో తెలుగులో విడుదల చేయనున్నారు. గాంధీ జయంతి సందర్భంగా ‘మానాడు’ ట్రైలర్ రిలీజ్ చేశారు. వెంకట్ ప్రభు మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడం పక్కా అనే హింట్ ఇచ్చారు ట్రైలర్‌తో.. శింబు గెటప్స్, తన స్టైల్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. శింబు, కళ్యాణిల పెయిర్ బాగుంది.

Hero Simbu : అందుకే మద్యం మానేశా.. రివీల్ చేసిన శింబు!

ముఖ్యంగా ఈ సినిమా కోసం శింబు చాలా బాగా మేకోవర్ అయ్యాడు. ఫిజిక్ దగ్గరినుంచి గెటప్స్ వరకు చాలా కేర్ తీసుకున్నాడు. ట్రైలర్‌లో రిచర్డ్ ఎమ్ నాథన్ విజువల్స్, యువన్ శంకర్ రాజా బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటున్నాయి. ‘మానాడు’ సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.