Simbu: డెడికేషన్ అంటే ఇదే.. బక్కచిక్కిన శింబు ఫోటో వైరల్!

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో శింబు హీరోగా తెరకెక్కుతున్న 'వెందు తనిందదు కాడు’ సినిమాపై ఇప్పుడు ఒక్క తమిళ ఇండస్ట్రీలోనే కాదు సౌత్ ఇండస్ట్రీ మొత్తం ఓ కన్నేసి ఉంచింది. మీనన్ - శింబు కాంబినేషన్ లో మూడవ సినిమా అనగానే అంచనాలు కూడా అదే రేంజిలో ఉన్నాయి.

Simbu: డెడికేషన్ అంటే ఇదే.. బక్కచిక్కిన శింబు ఫోటో వైరల్!

Simbu

Simbu: గౌతమ్ మీనన్ దర్శకత్వంలో శింబు హీరోగా తెరకెక్కుతున్న ‘వెందు తనిందదు కాడు’ సినిమాపై ఇప్పుడు ఒక్క తమిళ ఇండస్ట్రీలోనే కాదు సౌత్ ఇండస్ట్రీ మొత్తం ఓ కన్నేసి ఉంచింది. ఇప్పటికే ఈ కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు దక్షణాది మొత్తం బంపర్ హిట్స్ అయ్యాయి. విన్నైతాండి వరువాయా, అచ్చం ఎంబదు మాదమైదా సినిమాలు మన తెలుగులో ఏ మాయ చేసావే.. సాహసం శ్వాసగా సాగిపో సినిమాలుగా రీమేక్ అయ్యాయి. ఇప్పుడు మీనన్ – శింబు కాంబినేషన్ లో మూడవ సినిమా అనగానే అంచనాలు కూడా అదే రేంజిలో ఉన్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Silambarasan TR (@silambarasantrofficial)


ఈ మధ్యనే విడుదల చేసిన శింబు షాకింగ్ ఫస్ట్ లుక్ సినిమాపై మరింత ఇంట్రెస్ట్ పెంచింది. ఇంటెన్స్‌‌ లుక్‌‌ తో ఇదేదో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాగా ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. పక్కా రూరల్ నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం శింబు మేకోవర్ అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. ఇంతకు ముంది శింబు సిక్స్ ప్యాక్ బాడీ బిల్డ్ చేసి భారీ ఫిజిక్ తో, స్టైలిష్ గా కనిపించేవాడు. కానీ.. వెందు తనిందదు కాడు సినిమా కోసం ఏకంగా 30 కేజీల బరువు తగ్గి అందరికీ షాక్ ఇచ్చాడు.

 

View this post on Instagram

 

A post shared by Silambarasan TR (@silambarasantrofficial)


బక్కచిక్కిన లుక్ లో శింబు సరికొత్తగా కనిపిస్తుండగా.. పాత్రకు తగ్గట్లే సినిమాలో అగ్లీగా కనిపించనున్నట్లు తెలుస్తుంది. కాగా, ఈ సినిమా కోసం లేటెస్ట్‌గా తన ట్రాన్స్‌ఫర్మేషన్‌కు సంబంధించిన ఫోటోను శింబు తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఇందులో క్లీన్‌షేవ్‌తో కనిపిస్తున్న శింబు ఇంతకు ముందున్న బాడీలో సగభాగం తగ్గించేసి కనిపిస్తూ అందరికీ షాక్ ఇచ్చాడు. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అవుతుండగా శింబు డెడికేషన్ కు నెటిజన్ల ప్రశంసలు దక్కుతున్నాయి.