యూట్యూబ్‌లో రచ్చ రచ్చ చేస్తున్న రౌడీబేబీ
జనవరి 2న, మారి2లోని రౌడీబేబీ అనే వీడియో సాంగ్‌ని అఫీషియల్‌గా అప్‌లోడ్ చేసారు మేకర్స్. ఈ సాంగ్ నెటిజన్స్‌కి విపరీతంగా నచ్చేసింది.
జనవరి 2న, మారి2లోని రౌడీబేబీ అనే వీడియో సాంగ్‌ని అఫీషియల్‌గా అప్‌లోడ్ చేసారు మేకర్స్. ఈ సాంగ్ నెటిజన్స్‌కి విపరీతంగా నచ్చేసింది.
తమిళస్టార్ హీరో ధనుష్, మలయాళ బ్యూటీ సాయి పల్లవి జంటగా, బాలాజీ మోహన్ డైరెక్షన్‌లో, మారికి సీక్వెల్‌గా రూపొందిన సినిమా, మారి2. తెలుగులో అదే పేరుతో, డిసెంబర్ 21న రిలీజ్ అయ్యింది. అదే రోజు తెలుగులో హైప్ ఉన్న మరికొన్ని సినిమాలు రిలీజవడంతో, మన ప్రేక్షకులు ఈ సినిమా గురించి పట్టించుకోలేదు. తమిళ్‌లో యావరేజ్ టాక్‌తో సరిపెట్టుకుంది. జనవరి 2న, మారి2లోని రౌడీబేబీ అనే వీడియో సాంగ్‌ని అఫీషియల్‌గా అప్‌లోడ్ చేసారు మేకర్స్. ఈ సాంగ్ నెటిజన్స్‌కి విపరీతంగా నచ్చేసింది. కేవలం రెండు రోజుల్లోనే కోటికి పైగా వ్యూస్ వచ్చాయి.
యువన్ శంకర్ రాజా మ్యూజిక్, క్యాచీ లిరిక్స్‌తో పాటు, ధనుష్, ధీ వాయిస్ కూడా రౌడీబేబీ సాంగ్‌కి ప్లస్ అయ్యాయి. ఇక సాయి పల్లవి స్టెప్స్ అయితే ఇరగ దీసేసింది. హీరోయిన్ కాకముందు పలు డ్యాన్స్ షోలలో పార్టిసిపెట్ చేసింది సాయి పల్లవి. ఈ సాంగ్‌లో ధనుష్‌తో కలిసి దుమ్ము దులిపేసింది. కొన్ని కొన్ని చోట్ల ధనుష్‌ని డామినేట్ చేసేసింది. ప్రస్తుతం, రెండు కోట్లకి పైగా వ్యూస్, అయిదు లక్షలకి పైగా లైక్స్‌తో, సోషల్ మీడియాని షేక్ చేసేస్తుంది రౌడీబేబీ. చూస్తుంటే, ధనుష్ ఓల్డ్ రికార్‌ని రౌడీబేబి బ్రేక్ చేసేలా ఉంది.
వాచ్ రౌడీబేబీ సాంగ్…