గోపిచంద్ 28 ప్రారంభం

మ్యాచో హీరో గోపీచంద్, మిల్కీబ్యూటీ తమన్నా జంటగా మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది..

  • Published By: sekhar ,Published On : October 3, 2019 / 05:26 AM IST
గోపిచంద్ 28 ప్రారంభం

Updated On : October 3, 2019 / 5:26 AM IST

మ్యాచో హీరో గోపీచంద్, మిల్కీబ్యూటీ తమన్నా జంటగా మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది..

మ్యాచో హీరో గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్‌‌లో రూపొందనున్న సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ‘గౌతమ్ నంద’  తర్వాత గోపిచంద్, సంపత్ నంది కలయికలో.. ‘శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్’ బ్యానర్‌పై ‘ప్రొడక్షన్ నెం.3’ గా శ్రీనివాసా చిట్టూరి భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు.

హీరోగా గోపిచంద్‌కు 28వ సినిమా ఇది. మ్యాచో హీరోతో మిల్కీబ్యూటీ తమన్నా జతకడుతుంది. సినిమా ప్రారంభోత్సవానికి ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ముఖ్య అతిథిగా విచ్చేశారు. హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి బోయపాటి క్లాప్‌నిచ్చారు.. 

Read Also : సాహో : వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్..

ప్రస్తుతం నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతుంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. డిఓపి : సౌందర్‌ రాజన్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ : రాజీవ్‌ నాయర్‌, సమర్పణ : పవన్‌ కుమార్‌, నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : సంపత్‌ నంది..