Madhilo Madhi : ‘మదిలో మది’ టీజర్ రిలీజ్.. విడుదల చేసిన తాగుబోతు రమేష్..

తాగుబోతు రమేష్(Thagubothu Ramesh) అందమైన ప్రేమ కథ చిత్రం ‘మదిలో మది’ టీజర్‌ను విడుదల చేశారు.

Madhilo Madhi : ‘మదిలో మది’ టీజర్ రిలీజ్.. విడుదల చేసిన తాగుబోతు రమేష్..

Madhilo Madhi Movie Teaser Released Launched by Comedian Thagubothu Ramesh

Updated On : August 7, 2023 / 12:12 PM IST

Madhilo Madhi Teaser : జై, శీను, స్వీటీ, సిరి రావుల చారి, సునీతలు ప్రధాన పాత్రల్లో నటించిన అందమైన ప్రేమ కథ చిత్రం ‘మదిలో మది’. ఎస్ కే ఎల్ ఎమ్ క్రియేషన్స్ మీద నేముకూరి జయకుమార్ నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాకు ప్రకాష్ పల్ల దర్శకత్వం వహించారు. ఇటీవలే ఈ మూవీ రిలీజ్ డేట్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బేబి మూవీ డైరెక్టర్ సాయి రాజేష్(Sai Rajesh) విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ ను విడుదల చేసింది యూనిట్.

తాగుబోతు రమేష్(Thagubothu Ramesh) అందమైన ప్రేమ కథ చిత్రం ‘మదిలో మది’ టీజర్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మదిలో మది టీజర్‌ను చూశాను. ఎంతో ప్రామిసింగ్‌గా ఉంది. మంచి కంటెంట్‌తో యంగ్ బ్లడ్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో టీజర్ అలా కనిపించింది. మేకింగ్ అద్భుతంగా అనిపించింది. జెన్యూన్‌గా కథ చెప్పినట్టు అనిపిస్తుంది. మదిలో మది సినిమా టీంకు ఆల్ ది బెస్ట్. ప్రేక్షక దేవుళ్లంతా కూడా ఇలాంటి కొత్త టీంను ఆశీర్వదించాలి. ఆగస్ట్ 18న థియేటర్లోకి రాబోతోన్న మదిలో మది సినిమాను అందరూ చూడాల’ని కోరుకుంటున్నాను.

62 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్‌లో ప్రేమ తాలుకు బాధను, సంతోషాన్ని చూపించారు. స్వచ్చమైన ప్రేమ కథను చూపించినట్టుగా కనిపిస్తోంది. ప్రేమ కథా చిత్రాలకు అద్భుతమైన సంగీతం, ఆర్ఆర్ ప్రధాన ఆకర్షణలు అవుతాయి. ఈ టీజర్‌లో నేపథ్య సంగీతం అందరినీ మెప్పిస్తుంది. విజువల్స్ ఎంతో సహజంగా కనిపించాయి. ప్యూర్ లవ్ స్టోరీ అంటూ ట్యాగ్ పెట్టడంతోనే ఈ సినిమా కథ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు టీజర్ తోనే క్లారిటీ ఇస్తున్నారు చిత్రయూనిట్. ఈ టీజర్‌తో సినిమా మీద అంచనాలు నెలకొన్నాయి.

Madhilo Madhi Movie Teaser Released Launched by Comedian Thagubothu Ramesh

Annie : రాజన్న సినిమా చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్ గా ‘తికమక తాండ’ మూవీ

ఆ మధ్య ప్రముఖ ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్‌ విడుదల చేసిన టైటిల్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే బలగం మూవీ హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ చేతుల మీదుగా లాంచ్ అయిన టైటిల్ టీజర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు షారుఖ్‌ సంగీతం, క్రాంతి నీల, రాజేష్‌ మధుమాల సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు.