Madras High court denies anticipatory bail Actress kasthuri
Kasthuri : నటి కస్తూరికి మద్రాసు హైకోర్టులో చుక్కెదురైంది. ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఆమె దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సింగిల్ బెంచ్ ధర్మాసనం గురువారం కొట్టివేసింది.
కొద్ది రోజుల క్రితం తెలుగు వారిపై కస్తూరి అనుచిత వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆమె పై కేసులు నమోదు అయ్యాయి. ఆమెకు నోటీసులు ఇచ్చేందుకు ఇటీవల పోలీసులు ఆమె ఇంటికి వెళ్లారు. ఆమె ఇంటికి తాళం వేసుకుని ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకుని ఎటో వెళ్లిపోయింది. ఆమె కోసం గత వారం రోజులుగా పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
Matka Twitter Review : వరుణ్ తేజ్ ‘మట్కా’ ట్విట్టర్ రివ్యూ..
ఇదే సమయంలో ఆమె హైకోర్టును ఆశ్రయించింది. తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే.. న్యాయస్థానం ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది.
క్షమాపణలు చెప్పిన కస్తూరి..
తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో కస్తూరి క్షమాపణలు చెప్పింది. తనకు తెలుగు గడ్డ మెట్టినిల్లు అని, తెలుగు ప్రజలను తాను కించపరిచే విధంగా మాట్లాడలేదంది. తన వ్యాఖ్యలను డిఎంకే పార్టీ వక్రీకరించారని ఆరోపించింది. తనను ఆ పార్టీ నేతలు టార్గెట్ చేస్తున్నారంది. క్షమాపణలు చెప్పినప్పటికి ఆమెపై పలు ప్రాంతాలు కేసులు నమోదు అయ్యాయి.
Thaman : అతడిలో గొప్ప టాలెంట్ ఉంది.. అతడు ఇండియన్ ఐడల్‌లో పాడుతాడు : తమన్