Thaman : అత‌డిలో గొప్ప టాలెంట్ ఉంది.. అత‌డు ఇండియ‌న్ ఐడ‌ల్‌లో పాడుతాడు : త‌మ‌న్‌

తాజాగా అంధ యువ‌కుడిని ఉద్దేశించి సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ పోస్ట్ చేశారు.

Thaman : అత‌డిలో గొప్ప టాలెంట్ ఉంది.. అత‌డు ఇండియ‌న్ ఐడ‌ల్‌లో పాడుతాడు : త‌మ‌న్‌

He will definitely sing in Telugu Indian Idol Season 4 says thaman

Updated On : November 14, 2024 / 9:39 AM IST

టాలెంట్ అనేది ఎవ‌రి సొత్తు కాదు. ప్ర‌తి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. కొంద‌రి టాలెండ్ చూస్తే నిజంగా వావ్ అనిపిస్తూ ఉంటుంది. బ‌స్‌లో స‌ర‌దాగా పాడిన పాట ఓ అంధ యువ‌కుడికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అత‌డి స్వ‌రం అంద‌రి హృద‌యాల‌ను హ‌త్తుకుంటోంది.

ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ ఈ యువ‌కుడికి ఒక్క ఛాన్స్ ఇవ్వాల‌ని సంగీత ద‌ర్శ‌కుడు ఎంఎం కీర‌వాణిని కోరారు. ‘మనం చూడాలే కానీ.. ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో..! ఈ అంధ యువకుడు అద్భు తంగా పాడారు కదా.. ఒక అవకాశం ఇచ్చి చూడండి కీరవాణి సర్‌’ అని సజ్జనార్ ట్వీట్ చేసిన సంగ‌తి తెలిసిందే.

Ram Charan : క‌డ‌ప అమీన్ పీర్ ద‌ర్గాకు రామ్‌చ‌ర‌ణ్‌.. ఎప్పుడంటే?

ఇక తాజాగా ఈ యువ‌కుడిని ఉద్దేశించి సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ పోస్ట్ చేశారు. అత‌డు ఖ‌చ్చితంగా ఇండియ‌న్ ఐడ‌ల్‌లో పాడ‌పాడుతాడ‌ని హామీ ఇచ్చారు.

‘నేను వాగ్ధానం చేస్తున్నాను. ఈ అబ్బాయి క‌చ్చితంగా తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ సీజ‌న్ 4లో పాడుతాడు. అత‌డిలో గొప్ప టాలెంట్ ఉంది. అత‌డితో క‌లిసి నేను పాడ‌తాను. దేవుడు కొన్నిసార్లు కఠినంగా ఉన్నట్లు కనిపిస్తాడు. అయితేనేం.. అతడి టాలెంట్‌ను గుర్తించి అవకాశం ఇవ్వడానికి మనం ఉన్నాం కదా.’ అని త‌మ‌న్ రాసుకొచ్చాడు.

Kanguva Twitter Review : సూర్య ‘కంగువా’ ట్విట్ట‌ర్‌ రివ్యూ.. మూవీ హిట్టా? ఫ‌ట్టా? అంటే?