Re-Release : రీ రిలీజ్స్‌లో కొత్త ట్రెండ్ మొదలు పెడుతున్న అల్లు అరవింద్.. ఏంటో తెలుసా..?
థియేటర్స్ లో రీ రిలీజ్స్ ట్రెండ్ పాతది అయ్యిపోయింది అనుకున్నారో ఏమో.. టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ కొత్త ట్రెండ్ మొదలుపెట్టడానికి సిద్ధమవుతున్నారు.

magadheera athadu gharanamogudu re released in aha ott
Re-Release : పోకిరి సినిమాతో మొదలైన రీ రిలీజ్‌ల పరంపర ముందుకు సాగుతూ వెళ్తుంది. నిజం చెప్పాలంటే.. కొత్త సినిమాల రిలీజ్‌ల సందడి కంటే రీ రిలీజ్‌ల సందడి ఎక్కువ కనిపిస్తుంది. హీరోల పుట్టినరోజని, పండుగా రోజని, హీరోల కెరీర్ స్టార్ట్ చేసి మైల్ స్టోన్ కి చేరుకున్నారని, లేదా సూపర్ హిట్ మూవీ యానివర్సరీ అని.. ఇలా ఏదో కారణంతో రీ రిలీజ్‌లు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు అభిమానులు. అయితే ఈ ట్రెండ్ పాతది అయ్యిపోయింది అనుకున్నారో ఏమో.. టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ ఈ రీ రిలీజ్స్‌లో కొత్త ట్రెండ్ మొదలుపెట్టడానికి సిద్ధమవుతున్నారు.
రీ రిలీజ్ లు అంటే థియేటర్స్ లోనే ఉంటాయా ఏంటి..? ఓటీటీలో కూడా తీసుకు వస్తున్నాము అంటూ పోస్ట్ వేశారు. తమ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ‘ఆహా’లో ఈ రీ రిలీజ్ ల ట్రెండ్ ని స్టార్ట్ చేయబోతున్నట్లు అల్లు అరవింద్ తెలియజేశారు. ఈ ట్రెండ్ ని తమ నిర్మాణంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ‘మగధీర’తో మొదలు పెట్టబోతున్నట్లు వెల్లడించారు. రామ్ చరణ్, రాజమౌళి కలయికలో వచ్చిన ఈ సినిమా తెలుగు పరిశ్రమ రూపురేఖల్ని మార్చేసింది. ఈ సినిమా రీ రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.
Also read : Tiger Nageswara Rao : ఎట్టకేలకు కలెక్షన్స్ గురించి చెప్పిన నిర్మాతలు.. వారం రోజుల్లో టైగర్ నాగేశ్వరరావు..?
నవంబర్ 3న ప్రీమియం క్వాలిటీతో మగధీరని ఆహాలో రీ రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ మూవీ తరువాత మహేష్ బాబు, త్రివిక్రమ్ ఆల్ టైం ఫేవరెట్ సినిమా ‘అతడు’ని రీ రిలీజ్ చేయనున్నారు. నవంబర్ 10 నుంచి ఈ మూవీ ప్రీమియం క్వాలిటీతో ప్రసారం కానుంది. ఇక నవంబర్ 17న అల్లు అరవింద్ నిర్మాణం నుంచి వచ్చిన మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ చిరంజీవి ‘ఘరానా మొగుడు’ని రిలీజ్ చేయబోతున్నారు. మరి రానున్న రోజుల్లో ఇంకెన్ని బ్లాక్ బస్టర్ మూవీస్ ని ఆహాలో రీ రిలీజ్ చేస్తారో చూడాలి.
View this post on Instagram