Film Release Clash: మహేష్-చిరు.. తగ్గేది ఎవరు.. వచ్చేది ఎవరు?

ఫిబ్రవరిలో కరోనా తగ్గుముఖం పడుతుందని కాస్త టాక్ బయటకి రాగానే ఫిల్మ్ మేకర్స్ వాయిదా పడిన సినిమాలకి కొత్త డేట్స్ ప్రకటించే పనిలో పడ్డారు.

Film Release Clash: మహేష్-చిరు.. తగ్గేది ఎవరు.. వచ్చేది ఎవరు?

Film Release Clash

Updated On : January 30, 2022 / 9:48 PM IST

Film Release Clash: ఫిబ్రవరిలో కరోనా తగ్గుముఖం పడుతుందని కాస్త టాక్ బయటకి రాగానే ఫిల్మ్ మేకర్స్ వాయిదా పడిన సినిమాలకి కొత్త డేట్స్ ప్రకటించే పనిలో పడ్డారు. ఫిబ్రవరి రెండో భాగం నుండి తెలుగు సినీ పరిశ్రమలో ఫిల్మ్ ఫెస్టివల్ జరగబోతుందని మేకర్స్ అధికారికంగానే ప్రకటించారు. అయితే.. ఎవరు ఎప్పుడు రాబోతున్నారు అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. భారీ క్రేజ్ ఉన్న బడా సినిమాలే డజనుకు పైగా ఉన్నాయి.

James: పునీత్ పాత్రకి అన్న శివరాజ్ డబ్బింగ్.. కన్నీటి పర్యంతం!

పవర్ స్టార్, సూపర్ స్టార్, మెగా స్టార్, రెబల్ స్టార్, మెగా పవర్ స్టార్ ఇలా స్టార్ అందరి సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది. భారీ క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ ఏప్రిల్ లో ఉండబోతుండగా.. భీమ్లా నాయక్ ఫిబ్రవరిలోనే రాబోతున్నాడు. ఇక రాధే శ్యామ్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ మార్చిలోనే ఉండే అవకాశం ఉంది. ఇక సూపర్ స్టార్ సర్కారు వారి పాట, మెగాస్టార్ ఆచార్య రెండు సినిమాలు ఏప్రిల్ 1న విడుదలగా ప్రకటించారు.

Hrithik Roshan: కొత్త భామతో హృతిక్.. మళ్ళీ ప్రేమలో పడ్డాడా?

ముందుగా సర్కారు వారి పాట ముందే ఏప్రిల్ 1 అని ప్రకటించగా ఆచార్య ఫిబ్రవరి 4 అని ప్రకటించారు. కానీ.. అప్పటికి పరిస్థితి చక్కబడే పరిస్థితి లేక చిరు కూడా ఏప్రిల్ కి షిఫ్ట్ అయ్యాడు. అయితే.. మహేష్ సర్కారు వారి పాట షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండడంతో ఏప్రిల్ లో వచ్చే పరిస్థితి లేకపోవడంతో చిరు ఆ డేట్ ఫిక్స్ అయ్యాడని ఓ టాక్ నడుస్తుంది. ఏప్రిల్ 1 వచ్చేది ఎవరో.. వెనక్కి తగ్గేది ఎవరో త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.