Hrithik Roshan: కొత్త భామతో హృతిక్.. మళ్ళీ ప్రేమలో పడ్డాడా?

అమ్మాయిల కలల రాకుమారుడిగా.. గ్రీకు వీరుడిలా క్రేజ్ దక్కించుకున్న బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఎనిమిదేళ్ల క్రితమే భార్యకి విడాకులిచ్చేశాడు.

Hrithik Roshan: కొత్త భామతో హృతిక్.. మళ్ళీ ప్రేమలో పడ్డాడా?

Hrithik Roshan

Hrithik Roshan: అమ్మాయిల కలల రాకుమారుడిగా.. గ్రీకు వీరుడిలా క్రేజ్ దక్కించుకున్న బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఎనిమిదేళ్ల క్రితమే భార్యకి విడాకులిచ్చేశాడు. హృతిక్ తొలి చిత్రం క‌హోనా ప్యార్ హై రిలీజైన కొన్ని నెల‌ల‌కే అత‌ను సుసానేను ప్రేమించి పెళ్లాడాడు. 14 ఏళ్ల వైవాహిక బంధానికి 2014లో తెర‌దించగా.. అప్ప‌టికే హృతిక్-సుసానేకు ఇద్ద‌రు పిల్ల‌లున్నారు. పిల్లల కోసమే అప్పుడప్పుడు కలుస్తున్న ఈ జంట స్నేహితులుగా మిగిలిపోయారు.

Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ గేమ్ ప్లాన్.. ఓటీటీ కోసం మాజీ కంటెస్టెంట్లు?

హృతిక్ మాజీ భార్య సుసానే మరో కుర్రాడితో రిలేషన్ లో ఉందని అప్పుడప్పుడు వార్తలు వస్తున్నా హృతిక్ గురించి పెద్దగా రూమర్స్ లేవు. ఆ మధ్య కంగనా రనౌత్ తో ప్రేమలో ఉన్నాడని గాసిప్స్ వచ్చినా అది ఎక్కువ కాలం వార్తలలో లేదు. అయితే.. ఇన్నాళ్లకు హృతిక్ ఓ అమ్మాయితో రెస్టారెంట్ లో కనిపించడంతో బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. దీంతో హృతిక్ మళ్ళీ ప్రేమలో పడ్డాడా అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

All of Us Are Dead: నెట్ ఫ్లిక్స్ లో దూసుకుపోతున్న మరో కొరియన్ సిరీస్!

తాజాగా హృతిక్ సభా ఆజాద్ అనే అమ్మాయితో కలిసి ముంబ‌యిలోని ఒక ఫేమ‌స్ జ‌ప‌నీస్ రెస్టారెంట్లో విందుకు హాజ‌ర‌య్యాడు. రెస్టారెంట్ నుండి బ‌య‌టికి వ‌చ్చేట‌పుడు హృతిక్ అమ్మాయి చేయి ప‌ట్టుకుని న‌డిపించుకుంటూ కారు ద‌గ్గ‌రికి తీసుకొచ్చాడు. వాళ్లిద్ద‌రి మ‌ధ్య సాన్నిహిత్యం, హృతిక్ అమ్మాయిని ప్రొటెక్ట్ చేసిన తీరు చూసిన మీడియా సమ్ థింగ్ స్పెషల్ అని రాసేసింది. అప్పుడు మాస్క్ వేసుకుని ఉండ‌టంతో ఆ అమ్మాయిని ఎవ‌రూ గుర్తుప‌ట్ట‌లేదు కానీ.. చివరికి ఆ అమ్మాయి పేరు సభా ఆజాద్ అని సినీ ఇండస్ట్రీతో పరిచయం లేదని తేల్చారు. మరి ఇది ప్రేమా.. లేక జస్ట్ ఫ్రెండ్స్ అంటారో చూడాలి.