Mahesh Babu & Rao Ramesh: మహేష్-నమ్రతలతో పాటు గొప్ప మనసు చాటుకుంటున్న రావు రమేష్..

తన విలక్షణమైన విలనిజంతో తెలుగునాట చెరగని ముద్ర వేసుకున్న లెజండరీ యాక్టర్ "రావు గోపాలరావు". అయన తనయడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైనా 'రావు రమేష్'.. అతని దగ్గర ఎప్పటినుంచో పని చేస్తున్న మేకప్ మేన్ మృతి చెందడంతో రావు రమేష్ అతడి కుటుంబానికి అండగా నిలిచాడు. కాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చేనేత కార్మికులకు అండగా నిలుస్తున్నాడు.

Mahesh Babu & Rao Ramesh: మహేష్-నమ్రతలతో పాటు గొప్ప మనసు చాటుకుంటున్న రావు రమేష్..

Mahesh Babu and Rao Ramesh Showing a Great Heart

Updated On : September 16, 2022 / 8:58 PM IST

తన విలక్షణమైన విలనిజంతో తెలుగునాట చెరగని ముద్ర వేసుకున్న లెజండరీ యాక్టర్ “రావు గోపాలరావు”. అయన తనయడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైనా ‘రావు రమేష్’.. అతని తండ్రి లాగానే నటనలో ఒక విభిన్నమైన కోణాన్ని చూపిస్తూ ప్రేక్షకుల మదిలో ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నాడు. ప్రస్తుతం నటుడిగా ఫుల్ బిజీగా ఉన్న రావు రమేష్ తన ఉదారతను చాటుకున్నాడు.

Mahesh Babu: సినిమాలే కాదు సీరియల్స్ కూడా చూడాలంటున్న మహేష్.. సితారతో కలిసి సీరియల్స్ కోసం మహేష్ ప్రమోషనల్ సాంగ్!

అతని దగ్గర ఎప్పటినుంచో పని చేస్తున్న మేకప్ మేన్ మృతి చెందడంతో రావు రమేష్ అతడి కుటుంబానికి అండగా నిలిచాడు. తన పర్సనల్ మేకప్ మేన్ అయిన “బాబు” అకాల మరణం చెందగా.. రావు రమేష్ అతడి ఇంటికి వెళ్లి మరి బాబు కుటుంబ సభ్యులను ఓదార్చి, అండగా ఉంటానని భరోసా ఇవ్వడమే కాకుండా రూ.10 లక్షలు ఆర్థిక సాయం కూడా చేశాడు. దీంతో రావు రమేష్‌ ని సోషల్ మీడియా వేదికగా నెటిజెన్లు ప్రశంసిస్తున్నారు.

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు మంచితనం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంతోమంది పిల్లలకు గుండె చికిత్సలు చేయిస్తూ, కోట్లాది మంది గుండెచప్పుడు అవుతున్నాడు. కాగా ఇప్పుడు నారాయణపేట చేనేత కార్మికులకు అండగా నిలుస్తున్నాడు. నారాయణపేట గ్రామీణ మహిళలు “ఆరుణ్య నారాయణపేట” పేరుతో స్వయంగా ఓ వెబ్ పోర్టల్ నడుపుతున్నారు. ఆ పోర్టల్‌తో చేనేతకు సంబంధించి రకరకాల క్రాఫ్ట్స్ అందుబాటులోకి రానున్నాయి. దీనికి మహేష్, నమ్రతల మద్దతుగా నిలవడమే కాకుండా, ఆ వెబ్ పోర్టల్‌ లింక్‌ను తమ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో చేనేత కార్మికులు వారి ఆనందం వ్యక్తం చేశారు.