Mahesh Babu Athidi movie Re Release on Valentines Day
Athidi Re Release : ఇటీవల కాలంలో రీరిలీజ్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. స్టార్ హీరోల పుట్టిన రోజు, స్పెషల్ డేస్ సందర్భంగా స్టార్ హీరోలు నటించి ఘన విజయం సాధించిన మూవీలను రీరిలీజ్ చేస్తున్నారు. ఈ రీరిలీజ్ సినిమాలకు అద్భుతమైన స్పందన వస్తోన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సారి ప్రేమికుల రోజు సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ తరఫున ఓ స్పెషల్ రాబోతుంది. ఆయన నటించిన ఓ మూవీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతోంది.
మహేష్ బాబు, అమృతా రావు జంటగా తెరకెక్కిన మూవీ ‘అతిథి’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2007లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మణిశర్మ సంగీతాన్ని అందించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. అయితే.. మహేశ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
కాగా.. ఇప్పుడు ఈ సినిమా రీరిలీజ్ చేయనుండడంతో అభిమానులు మళ్లీ ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే.. గత ఏడాది జనవరి 12న సూపర్ స్టార్ మహేశ్ బాబు గుంటూరు కారం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం ఆయన దర్శక దీరుడు రాజమౌళితో డైరెక్షన్‌లో ఓ మూవీలో నటించనున్నాడు. మహేశ్ కెరీర్‌లో 29వ చిత్రంగా తెరకెక్కనుంది. ఇటీవలే ఈ చిత్ర పూజా కార్యక్రమాలను జరుపుకుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.