హ్యాపీ బర్త్‌డే నమ్రత – శ్రీమతికి శుభాకాంక్షలు తెలిపిన సూపర్‌స్టార్
నమ్రత పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపిన సూపర్‌స్టార్ మహేష్ బాబు..

నమ్రత పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపిన సూపర్‌స్టార్ మహేష్ బాబు..
సూపర్‌స్టార్ మహేష్ బాబు అర్థాంగి నమ్రత పుట్టినరోజు ఈరోజు (జనవరి 22).. ఈ సందర్భంగా మహేష్ తన భార్యకు బర్త్‌డే విషెస్ తెలిపాడు. ‘నేను ఎంతగానో ప్రేమించే నా ఇల్లాలికి, జీవిత భాగస్వామికి పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశాడు. ఇక మహేష్ సోదరి మంజుల కూడా నమ్రతకు బర్త్‌డే విషెస్ తెలిపింది.
‘నీ కలలు నిజమవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. లవ్ యూ సో మచ్..’ అంటూ నమత్రతో కలిసి దిగిన ఫొటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. 1972 జనవరి 22న జన్మించిన నమ్రత 1993లో ఫెమినా మిస్ ఇండియా కిరీటం దక్కించుకున్నారు.
Read Also : విక్టరీ వెంకటేష్ 74 – ‘‘నారప్ప’’
తర్వాత పలు హిందీ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న నమ్రత మహేష్ బాబు సరసన ‘వంశీ’లో నటించారు. ఈ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడి 2005, ఫిబ్రవరి 10న వివాహం చేసుకున్నారు. పెళ్లి తరువాత నమ్రత సినిమాలకు గుడ్ బై చెప్పారు. 2005లో వారికి కుమారుడు గౌతమ్ జన్మించగా, 2012లో కుమార్తె సితార పుట్టింది. ప్రస్తుతం మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ సక్సెస్‌తో పాటు భార్య బర్త్‌డేని సెలబ్రేట్ చేయడానికి వెకేషన్‌కు అమెరికా వెళ్లారు.
Wishing the woman of the house, the woman in my life❤❤❤ the Happiest Birthday!!! Just love and more love ???
Namrata ??? pic.twitter.com/QuhuO64LSG— Mahesh Babu (@urstrulyMahesh) January 21, 2020