అమెజాన్ అడవుల్లో అగ్నిప్రమాదం.. మహేష్ బాబు మెసేజ్ ఇదే!

  • Published By: veegamteam ,Published On : August 23, 2019 / 11:11 AM IST
అమెజాన్ అడవుల్లో అగ్నిప్రమాదం.. మహేష్ బాబు మెసేజ్ ఇదే!

Updated On : August 23, 2019 / 11:11 AM IST

అమెజాన్ అడవుల్లో 15రోజుల పైగా మంటలు వ్యాపిస్తుండటంతో అడవి దగ్దమవుతోంది. వేళాది హెక్టార్లలో విస్తరించిన చెట్లు అగ్ని దాటికి కాలి బూడిదవుతున్నాయి. దీంతో దగ్గరలోని ప్రాంతాలు పొగతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నయి. అంతేకాదు ఈ ఏడాదిలో ఇప్పటికే అమెజాన్ లో దాదాపు 75వేల అగ్నిప్రమాదాలు సంభవించాయని బ్రెజిల్‌ అంతరిక్ష పరిశోధన సంస్థ వెల్లడించింది.

వివరాలు.. బ్రెజిల్‌ కు చెందిన అమెజాన్ అడ‌వులు ప్ర‌తి ఏడాది రికార్డు స్థాయిలో ద‌గ్ధం అవుతున్నాయి. ఆ దేశానికి చెందిన స్పేస్ ఏజెన్సీ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. దీంతో సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, శాస్త్రవేతలు దీనిపై స్పందిస్తున్నారు. ఊపిరితిత్తులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.. ఇప్పటికైనా మేల్కొని అమెజాన్ ని కాపాడుకుందాం అని పిలుపునిస్తున్నారు. 

టాలీవుడు నుంచి మొదట మహేష్ బాబు ఇలా ట్విట్ చేశారు.. ఈ వార్త చాలా బాధాక‌రమైన‌ది. 20 శాతం ఆక్సీజ‌న్‌ ని అందించే అమెజాన్ అడవులు మంట‌ల‌లో కాలిపోతున్నాయి. ఇప్ప‌టికైన మేల్కొని అమెజాన్ రెయిన్ ఫారెస్ట్‌ని కాపాడుకుందాం. మన భూమిని రక్షించుకోవడానికి మనవంతు ప్రయత్నం  చేద్దాం. ఆ ప్రయత్నం ఎక్కడి నుంచో కాదు.. మ‌న ఇంటి నుంచి ప్రారంభిద్దాం! అని మ‌హేష్ పిలుపునిచ్చారు. ఇలాగే సాయిధ‌ర‌మ్ తేజ్, అనుష్క శ‌ర్మ‌, అర్జున్ క‌పూర్ తో పాటు కొంతమంది ప్ర‌ముఖులు కూడా అమెజాన్ అడ‌వుల‌ని కాపాడుకుందాం అని సోష‌ల్ మీడియా ద్వారా  నెటిజ‌న్స్‌ని కోరారు.