Mahesh Babu : శ్రీలంకకు వెళ్తున్న మహేష్ బాబు.. షూటింగ్ కోసమా? వెకేషన్ కోసమా? ఫ్లైట్ లో ఫోటో వైరల్..

తాజాగా మహేష్ బాబు ఫోటో వైరల్ గా మారింది.

Mahesh Babu

Mahesh Babu : మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ షూటింగ్ జరిగింది. త్వరలో కెన్యాలో, టాంజానియా దేశాల్లోని అడవుల్లో షూటింగ్ జరగనుందని సమాచారం. మూవీ యూనిట్ అంతా ఆ దేశాలకు త్వరలోనే వెళ్లనున్నారు అని తెలుస్తుంది.

ఈ క్రమంలో తాజాగా మహేష్ బాబు ఫోటో వైరల్ గా మారింది. శ్రీలంకన్ ఎయిర్ లైన్స్ మహేష్ బాబు ఫ్లైట్ లో శ్రీలంక వెళ్తుండగా ఫ్లైట్ లో ఉన్న ఎయిర్ హోస్టెస్ తో దిగిన ఫోటోని తమ సోషల్ మీడియాలో షేర్ చేసింది. మహేష్ బాబు ఫోటో షేర్ చేసి.. సౌత్ ఇండియన్ సినిమా ఐకాన్ మహేష్ బాబు హైదరాబాద్ నుంచి కొలంబోకి మా ఫ్లైట్ లో ప్రయాణించడం ఆనందంగా ఉంది అని తెలిపారు.

Also Read : Anirudh : ‘కింగ్డమ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనిరుధ్ లైవ్ పర్ఫార్మెన్స్.. ఫ్యాన్స్ కి పండగే.. లీక్ చేసిన నిర్మాత..

దీంతో మహేష్ బాబు ఫ్లైట్ లో శ్రీలంక వెళ్తున్న ఫోటో వైరల్ అవ్వగా షూటింగ్ కి వెళ్తున్నారా లేదా వెకేషన్ కి వెళ్తున్నారా అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. షూటింగ్ కెన్యాలో అన్నారు, శ్రీలంకకు ఎందుకు వెళ్తున్నారు? లేదా శ్రీలంకలో షూట్ ప్లాన్ చేసారా? ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్తున్నాడా అని బోలెడన్ని సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.

 

Also Read : Betting Apps : బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణ.. ఈ స్టార్స్ అంతా విచారణకు రావాల్సిందే.. ఎవరెవరు ఎప్పుడు?