Mahesh Babu : ‘సర్కారు వారి పాట’ ట్రైలర్ వస్తోంది.. ఎప్పుడంటే..?

మే 12 నుంచి బాక్సాఫీస్ రికవరీ మొదలుపెడతామన్న మేకర్స్ ప్రకటన కూడా ఆసక్తి రేపుతోంది.

Mahesh Babu : ‘సర్కారు వారి పాట’ ట్రైలర్ వస్తోంది.. ఎప్పుడంటే..?

Sarkaru vaari Paata

Updated On : April 28, 2022 / 4:55 PM IST

Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన అప్ కమింగ్ క్రేజీ ఫ్లిక్ “సర్కారు వారి పాట“. గ్లింప్స్, టీజర్లు, కొన్ని పాటలు ఇప్పటికే విడుదలవడంతో.. ట్రైలర్ ఎప్పుడెప్పుడా అని ప్రిన్స్ అభిమానులతో పాటు మూవీ లవర్స్ అందరూ ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్న వారందరికీ మూవీ యూనిట్ గుడ్ న్యూస్ చెప్పేసింది. సర్కారు వారి పాట మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది.

Read This : Sarkaru Vaari Paata: ప్రమోషన్లు షురూ.. రంగంలోకి దిగనున్న మహేష్!

మహేశ్ బాబు – కీర్తి సురేశ్ జంటగా డైరెక్టర్ పరశురాం రూపొందించిన సర్కారు వారి పాట సినిమా మే 12న రిలీజ్ అవుతోంది. పలు మార్లు విడుదల వాయిదా ప్రకటన తర్వాత.. మే 12ను రిలీడ్ డేట్ గా ఫిక్స్ చేసిన మేకర్స్.. లేటెస్ట్ గా క్రేజీ అప్ డేట్ ఇచ్చేశారు. రిలీజ్ కు సరిగ్గా పది రోజుల ముందు.. మే 2వ తేదీన Sarkaru vaari paata మూవీ ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో పోస్టర్ స్టేట్ మెంట్ ఇచ్చేశారు.

ట్రైలర్ RRలో తమన్ బిజీ

సర్కారు వారి పాట మూవీ యాక్షన్ ప్యాక్డ్ గా ఉంటుందని ఇప్పటికే మూవీ మేకర్స్ తెలిపారు. మూవీ థీమ్ కు తగ్గట్టుగానే .. పక్కా మాస్ – యాక్షన్ సన్నివేశాలతో ట్రైలర్ ను రూపొందిస్తున్నట్టు ప్రకటించారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ ట్రైలర్ కు ఆర్ఆర్ ఇవ్వడంలో బిజీగా ఉన్నాడని చెప్పారు. ఇంతకుముందు ఎన్నడూ మహేశ్ బాబును చూడని మాస్ లుక్ లో డైరెక్టర్ పరశురాం చూపించబోతున్నట్టు మేకర్స్ తమ ప్రకటనలో తెలిపారు. మహేశ్ బాబు స్టైలిష్ గా కనిపిస్తున్నా.. అతడి పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయన్నారు.

తాళాల గుత్తితో యాంగ్రీ లుక్ లో రౌడీలను ఇరగ దీస్తున్నట్టుగా ఉన్న మహేశ్ బాబు లుక్ ఫ్యాన్స్ ను కిర్రెక్కిస్తోంది. కామన్ డీపీగా, యూనిఫామ్ ప్రొఫైల్ పిక్ గా మారిపోయింది.

Read This : Sarkaru Vaari Paata: కళావతి @ 150 మిలియన్

మూవీలోని కళావతి, పెన్నీ, టైటిల్ ట్రాక్ పాటలు.. చార్ట్ బస్టర్స్ లో టాప్ లో కంటిన్యూ అవుతున్నాయి. మహేశ్-కీర్తిపై రీసెంట్ గా తీసిన మాస్ పాటను.. నాలుగో పాటగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సాంగ్.. మాస్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచిపోతుందని మూవీ టీం భావిస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్ టైన్ మెంట్, 14 రీల్స్ సంస్థలు సర్కారు వారి పాట మూవీని ప్రొడ్యూస్ చేశాయి. మే 12 నుంచి బాక్సాఫీస్ రికవరీ మొదలుపెడతామన్న మేకర్స్ ప్రకటన కూడా ఆసక్తి రేపుతోంది.