Murari Record : ఆన్లైన్ టికెట్ బుకింగ్స్‌లో కూడా ‘మురారి’ సరికొత్త రికార్డ్.. మహేష్ ఫ్యాన్సా మజాకా..

ఇప్పటివరకు రీ రిలీజ్ అయిన సినిమాల కంటే కూడా ఎక్కువగా మురారి లాంటి క్లాసిక్ సినిమాకి ఫ్యాన్స్ రచ్చ చేసారు.

Murari Record : ఆన్లైన్ టికెట్ బుకింగ్స్‌లో కూడా ‘మురారి’ సరికొత్త రికార్డ్.. మహేష్ ఫ్యాన్సా మజాకా..

Mahesh Babu Murari Movie Creates New Record in Collections and Online Ticket Bookings

Updated On : August 12, 2024 / 12:50 PM IST

Murari Re Release Record : ఇటీవల రీ రిలీజ్ సినిమాలు కూడా సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. రీ రిలీజ్ సినిమాలకు కూడా భారీగా కలెక్షన్స్ వస్తున్నాయి. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మహేష్ క్లాసిక్ హిట్ సినిమా మురారి రీ రిలీజ్ అయింది. దీంతో అభిమానులు అంతా థియేటర్స్ లో సందడి చేసారు. ఇప్పటివరకు రీ రిలీజ్ అయిన సినిమాల కంటే కూడా ఎక్కువగా మురారి లాంటి క్లాసిక్ సినిమాకి ఫ్యాన్స్ రచ్చ చేసారు.

ఇప్పటికే థియేటర్స్ లో మహేష్ ఫ్యాన్స్ చేసిన హంగామా వీడియోల రూపంలో వైరల్ గా మారాయి. కలెక్షన్స్ విషయంలో మురారి సినిమా సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఒక్క రోజులోనే 5 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది మురారి సినిమా. ఇక రెండు రోజుల్లో 7 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇటీవల వచ్చే మీడియం రేంజ్ సినిమాలు కూడా రెండు రోజుల్లో ఇన్ని కలెక్షన్స్ సాధించట్లేదు. అలాంటిది మురారి సినిమా ఈ రేంజ్ కలెక్షన్స్ సాధించి ఇప్పటివరకు రీ రిలీజ్ అయిన సినిమాల్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది.

Also Read : క్రికెట్ ఆడుతున్న తాతమనవడు.. అల్లు అయాన్ బ్యాటింగ్ అదుర్స్.. వీడియో వైరల్..

కలెక్షన్స్ కాకుండా ఆన్లైన్ టికెట్ బుకింగ్స్ లో కూడా రీ రిలీజ్ సినిమాల్లో సరికొత్త రికార్డ్ సృష్టించింది. మురారి సినిమాకు ఆన్లైన్ బుక్ మై షోలో టికెట్స్ ఓపెన్ అయిన రోజు ఆగస్టు 3న ఆల్మోస్ట్ 41 వేల టికెట్స్ అముడయ్యాయి. సినిమా రిలీజ్ ముందు రోజు ఆగస్టు 8న 35 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. సినిమా రిలీజ్ రోజు ఆగస్టు 9న ఏకంగా 53 వేలకు పైగా టికెట్స్ అమ్ముడు పోయాయి. రీ రిలీజ్ తర్వాత రోజు ఆగస్టు 10 కూడా 28 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇప్పటివరకు బుక్ మై షోలో మొత్తం మురారి రీ రిలీజ్ కి ఏకంగా 2 లక్షల 57 వేలకుపైగా టికెట్స్ అమ్ముడుపోయి రీ రిలీజ్ టికెట్ బుకింగ్స్ లో కూడా సరికొత్త రికార్డ్స్ సృష్టించింది. దీంతో మహేష్ ఫ్యాన్సా మజాకా అని ఆశ్చర్యపోతున్నారు.