Mahesh Babu : మహేష్ బాబు కొత్త జిమ్ ఫోటో చూశారా..? ఏం కండలురా బాబు..!

మహేష్ బాబు తన జిమ్ నుంచి మరో కొత్త ఫోటోని షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

Mahesh Babu : మహేష్ బాబు కొత్త జిమ్ ఫోటో చూశారా..? ఏం కండలురా బాబు..!

Mahesh Babu new gym workout photo gone viral

Updated On : October 12, 2023 / 3:27 PM IST

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ఈమధ్య జిమ్ లో తెగ వర్క్ అవుట్స్ చేస్తున్నాడు. డైలీ షెడ్యూల్ వేసుకొని మరి కసరత్తులు చేస్తున్నాడు. ఫోటోలు షేర్ చేస్తూ తన చేసిన కొన్ని వర్క్ అవుట్స్ ని అభిమానులకు కూడా నేర్పిస్తున్నాడు. ఈక్రమంలోనే మహేష్ తన జిమ్ నుంచి వరుసగా ఫోటోలు షేర్ చేస్తూ వస్తున్నాడు. తాజాగా ఈ హీరో మరో కొత్త ఫోటోని షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

“హార్డ్ వర్క్ చేసే వరకు ప్రతి విషయం బ్లాక్ అండ్ వైట్ గానే కనిపిస్తుంది. కసరత్తులు చేయండి” అంటూ తన ఫోటోని షేర్ చేశాడు మహేష్ బాబు. ఇక ఫొటోలో బాబు కండలు చూసిన ఆడియన్స్.. ‘ఏం కండలురా బాబు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ పిక్స్ చూసిన మరికొందరు.. ఈ వర్క్ అవుట్స్ అన్ని రాజమౌళి సినిమా కోసమేనా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also read : Samantha : మళ్ళీ ఆసుపత్రి బెడ్‌పై సమంత.. ఒక చేతికి సెలైన్.. మరో చేతిలో..

 

View this post on Instagram

 

A post shared by Mahesh Babu (@urstrulymahesh)

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబుని ఇదే విషయం గురించి ప్రశ్నించగా, మహేష్ బదులిస్తూ.. ఇంకా ఆ సినిమా కోసం ఏం హోమ్ వర్క్ స్టార్ట్ చేయలేదని పేర్కొన్నాడు. మహేష్ బాబు ప్రస్తుతం ‘గుంటూరు కారం’ సినిమాలో నటిస్తున్నాడు. త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ దసరాకి ఒక సాంగ్ ని రిలీజ్ చేస్తామంటూ నిర్మాతలు ఆల్రెడీ కన్ఫార్మ్ చేశారు.

థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. మీనాక్షి చౌదరి, శ్రీలీల ఈ మూవీలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇప్పటివరకు మహేష్ ని చూడనంత మాస్ గా ఈ మూవీలో చూడబోతున్నారని మేకర్స్ తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన లుక్స్ కూడా ఆ రేంజ్ లోనే ఉంది.