Samantha : మళ్ళీ ఆసుపత్రి బెడ్‌పై సమంత.. ఒక చేతికి సెలైన్.. మరో చేతిలో..

మొన్నటి వరకు హుషారుగా అమెరికా, యూరోప్ దేశాలను చుట్టేసిన సమంత సడన్ గా ఇలా మళ్ళీ ఆసుపత్రి బెడ్‌పై కనిపించడంతో అభిమానులు కంగారు పడుతున్నారు.

Samantha : మళ్ళీ ఆసుపత్రి బెడ్‌పై సమంత.. ఒక చేతికి సెలైన్.. మరో చేతిలో..

Samantha is seen on the hospital bed photo gone viral

Updated On : October 12, 2023 / 2:53 PM IST

Samantha : టాలీవుడ్ హీరోయిన్ సమంత.. మయోసైటిస్ చికిత్స కోసం సినిమాలకు బ్రేక్ ప్రకటించి విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు అక్కడ ఎంజాయ్ చేస్తూ కనిపించిన సమంత.. ఇప్పుడు సడన్ గా ఆసుపత్రి బెడ్‌ పై కనిపిస్తుంది. మొన్నటి వరకు హుషారుగా అమెరికా, యూరోప్ దేశాలను చుట్టేసిన సమంత సడన్ గా ఇలా మళ్ళీ ఆసుపత్రి బెడ్‌పై కనిపించడంతో అభిమానులు కంగారు పడుతున్నారు. సమంత తాజాగా తన ఇన్‌స్టాలో ఒక స్టోరీ షేర్ చేసింది.

ఆ స్టోరీలో సమంత ఒక చేతికి సెలైన్, మరో చేతిలో లాప్‌టాప్ పట్టుకొని ఏదో సినిమా చూస్తుంది. ఇక పోస్ట్ లో సమంత రాసిన కామెంట్స్ చూస్తుంటే.. ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోవడానికి సమంత ఆసుపత్రి లో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ గా మారింది. కాగా సమంత చివరి రెండు రోజులు చేసిన పోస్టులు బట్టి.. ఆమె ఇప్పుడు దుబాయ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. మరి అక్కడ ఎన్నాళ్ళు ఉండబోతుందో చూడాలి. అలాగే ఈ చికిత్స ఎన్నాళ్ళు తీసుకోవాల్సి ఉందో తెలియాల్సి ఉంది.

Samantha is seen on the hospital bed photo gone viral

Also read : Nupur Sanon : నుపుర్ సనన్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.. కృతి సనన్ సిస్టర్ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో ఎంట్రీ..

ఇక ఇటీవల సమంత పోస్టు సినిమా కొన్ని ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. ఆ పిక్స్ తో నెట్టింట సామ్-చైతన్య విడాకుల వార్త మరోసారి చర్చకు వచ్చింది. సమంత నడుము మీద ఉండే నాగచైతన్య టాటూ ఇప్పుడు కనిపించడం లేదు. దీంతో ఆమె చైతన్యని తన లైఫ్ లో నుంచి పూర్తిగా తీసేసిందా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే, నాగచైతన్య ఏమో సమంత పెంపుడు కుక్కతో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం వీరిద్దరి పోస్టులు నెట్టింట వైరల్ గా మారాయి.