Mahesh Babu : అబ్బ.. మహేష్ బాబు కొత్త లుక్ అదిరిపోయిందిగా.. యాడ్ షూట్ కోసం..
మహేష్ యాడ్స్ ఎక్కువగా చేస్తారని తెలిసిందే. తాజాగా ఓ కొత్త యాడ్ షూట్ లో మహేష్ పాల్గొన్నారు. ఈ యాడ్ షూట్ కి సంబంధించి కొన్ని ఫోటోలు నమ్రత శిరోద్కర్ షేర్ చేయడంతో అవి వైరల్ గా మారాయి.

Mahesh Babu New Look for an Ad Shoot Namrata Shirodkar Shares Pics Goes Viral
Mahesh Babu New Look : మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం(Guntur Kaaram) సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కుదిరినప్పుడల్లా ఫారిన్ టూర్లు వేస్తూ మధ్య మధ్యలో గుంటూరు కారం సినిమాకు డేట్లు ఇస్తుండటంతో ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. మహేష్ అభిమానులు గుంటూరు కారం, ఆ తర్వాత రాజమౌళి సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఇక మహేష్ యాడ్స్ ఎక్కువగా చేస్తారని తెలిసిందే. తాజాగా ఓ కొత్త యాడ్ షూట్ లో మహేష్ పాల్గొన్నారు. ఈ యాడ్ షూట్ కి సంబంధించి కొన్ని ఫోటోలు నమ్రత శిరోద్కర్ షేర్ చేయడంతో అవి వైరల్ గా మారాయి. ఈ ఫొటోస్ లో మహేష్ లుక్ అదిరిపోయింది. మహేష్ కొత్త హెయిర్ స్టైల్ తో అదిరిపోయే లుక్స్ తో సూపర్ ఉన్నాడు. ఇక ఈ కొత్త హెయిర్ స్టైల్ ప్రముఖ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ చేశారు. ఈ ఫొటోలో అలీమ్ ఖాన్ కూడా మహేష్ పక్కన ఉన్నారు.
Also Read : Salaar : ప్రభాస్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి.. సలార్ వచ్చేస్తున్నాడు.. ఆ పండక్కే రిలీజ్..
దీంతో అభిమానులు, నెటిజన్లు హాలీవుడ్ హీరోలా ఉన్నావంటూ, మహేష్ కొత్త లుక్ అదిరిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ లుక్ తో ఒక్క యాక్షన్ సినిమా పడితే రికార్డులు అన్ని బ్రేక్ అవుతాయి అని అభిమానులు కోరుకుంటున్నారు. 48 ఏళ్ళు వచ్చినా ఇంకా కుర్రాడిలా మెయింటైన్ చేస్తూ మహేష్ ఎప్పటికప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తాడు. ఇప్పుడు ఇలా మరో సరికొత్త లుక్ లో అభిమానులని మెప్పిస్తున్నాడు మహేష్ బాబు.
View this post on Instagram