Mahesh Babu : హాలీవుడ్ రేంజ్ మహేష్ బాబు కొత్త మౌంటెన్ డ్యూ యాడ్..
ఈ మధ్య కాలంలో కమర్షియల్ యాడ్స్ ని కూడా హాలీవుడ్ రేంజ్ లో చిత్రీకరిస్తున్నారు. ఇటీవల విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న థమ్స్ అప్ యాడ్ లో హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ తో అదరగొట్టేశాడు. తాజాగా మహేష్ బాబు కూడా తన కొత్త యాడ్ లో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సన్నివేశంతో వచ్చాడు.

Mahesh Babu new mountain dew ad is in hollywood range
Mahesh Babu : ఈ మధ్య కాలంలో కమర్షియల్ యాడ్స్ ని కూడా హాలీవుడ్ రేంజ్ లో చిత్రీకరిస్తున్నారు. ఇటీవల విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న థమ్స్ అప్ యాడ్ లో హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ తో అదరగొట్టేశాడు. తాజాగా మహేష్ బాబు కూడా తన కొత్త యాడ్ లో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సన్నివేశంతో వచ్చాడు. ప్రస్తుతం మహేష్ మౌంటెన్ డ్యూకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. గత మౌంటెన్ డ్యూ యాడ్ లో వరల్డ్ హైయెస్ట్ బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా పై నుంచి బైక్ తో స్టంట్ చేసిన మహేష్.. ఇప్పుడు ఇంకొంచెం డోస్ పెంచాడు.
Mahesh Babu: మహేష్ సినిమాలో మరో బాలీవుడ్ బ్యూటీ.. ఎవరంటే?
ఈసారి ఏకంగా గాలిలో ఉన్న విమానంలో నుంచి బైక్ వేసుకొని బయటకి దూకి ఆకాశంలోనే ఉన్న మరో విమానంలో ల్యాండ్ అయ్యే సీన్ తెరకెక్కించారు. ఇక యాడ్ ని మహేష్ బాబు, నమ్రత వాళ్ళ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ యాడ్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇక మహేష్ బాబు సినిమాలు విషయానికి వస్తే.. ప్రస్తుతం SSMB28 చిత్రంలో నటిస్తున్నాడు. మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. వీరిద్దరి కలయికలో వస్తున్న మూడో మూవీ ఇది. దీని పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా పై నిర్మాతలు కూడా అదే రేంజ్ నమ్మకంతో ఉన్నారు. కలెక్షన్స్ పరంగా రాజమౌళి సినిమాల వరకు చేరుకుంటాము అంటూ ఓపెంట్ స్టేట్‌మెంట్ ఇస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకం పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో మహేష్ బాబుకి జోడిగా శ్రీలీల, పూజా హెగ్డే నటిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాది ఆగష్టు 11న ఈ మూవీని కచ్చితంగా రిలీజ్ చేస్తాము అంటూ నిర్మాతలు చెబుతున్నారు.
View this post on Instagram