మహేష్ కొత్త సినిమా టైటిల్ అదేనా?

పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్2 సినిమాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో, మహేష్ తన 26వ సినిమా చెయ్యబోతున్నాడు.

  • Published By: sekhar ,Published On : April 27, 2019 / 12:15 PM IST
మహేష్ కొత్త సినిమా టైటిల్ అదేనా?

Updated On : April 27, 2019 / 12:15 PM IST

పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్2 సినిమాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో, మహేష్ తన 26వ సినిమా చెయ్యబోతున్నాడు.

సూపర్ స్టార్ మహేష్ బాబు, హీరోగా నటిస్తున్న 25వ సినిమా.. మహర్షి.. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో, అశ్వినీదత్, దిల్ రాజు, పెరల్ వి.పొట్లూరి – పరమ్ వి.పొట్లూరి కలిసి నిర్మిస్తుండగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా, అల్లరి నరేష్ హీరో ఫ్రెండ్‌గా నటించారు. ఈ సినిమా తర్వాత మహేష్, సుకుమార్‌తో సినిమా చెయ్యాల్సింది కానీ, కొన్ని కారణాల వల్ల కుదరలేదు. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో సినిమా సంగతి ఇంకా కొలిక్కి రాలేదు. కట్ చేస్తే, అనిల్ రావిపూడి లైన్‌లోకి వచ్చాడు. పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్2 సినిమాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో, మహేష్ తన 26వ సినిమా చెయ్యబోతున్నాడు.

ఈ సినిమాకి ‘సరిలేరు నీకెవ్వరూ’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. దిల్ రాజు నిర్మించబోయే ఈ ప్రాజెక్ట్‌ని మహర్షి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో అఫీషియల్‌గా అనౌన్స్ చెయ్యనున్నారు.
మే 1న హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని, పీపుల్స్ ప్లాజాలో, మహర్షి ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుంది. మే 9న సినిమా రిలీజ్ కానుంది.

వాచ్ మహర్షి టీజర్..