Ramesh Babu : అన్న రమేశ్ బాబు కడసారి చూపుకు మహేశ్ బాబు దూరం..!

మహేశ్ బాబు గత కొన్ని రోజుల క్రితమే కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం తన ఇంట్లోనే ఐసొలేట్ అయి ఉన్నారు. దీంతో ఆయన బయటకి రాలేని పరిస్థితి. అన్న మరణం మహేశ్ కి ఎంతో బాధని కలిగించింది.

Ramesh Babu : అన్న రమేశ్ బాబు కడసారి చూపుకు మహేశ్ బాబు దూరం..!

Mahesh Ramesh

Updated On : January 9, 2022 / 11:47 AM IST

Ramesh Babu :   సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు, మహేశ్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేష్ బాబు నిన్న రాత్రి మరణించిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నఆయన నిన్న ఆరోగ్యపరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి తరలిస్తుండగా తుదిశ్వాస విడిచారు. దీంతో ఘట్టమనేని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియచేస్తున్నారు.

ఇవాళ ఉదయం నుంచి రమేశ్ బాబు భౌతిక కాయాన్ని సందర్శనార్థం పద్మాలయ స్టూడియోలో ఉంచారు. కరోనా దృష్ట్యా కేవలం కుటుంబ సభ్యులకి, సినీ ప్రముఖులకు మాత్రమే ఎంట్రీ ఉంది. అభిమానులకు ఎంట్రీ లేదని తెలుస్తుంది. ఇప్పటికే ఘట్టమనేని కుటుంబ సభ్యులంతా పద్మాలయ స్టూడియోస్ కి తరలి వచ్చారు. కొంతమంది సినీ ప్రముఖులు కూడా విచ్చేసి రమేశ్ బాబుకి నివాళులు అర్పిస్తున్నారు. అయితే అన్న చివరి చూపు కూడా మహేశ్ బాబుకి దక్కేలా లేదు.

Kalyan Krishna : ‘బంగార్రాజు’లో నాగార్జున మనవడిగా చైతూ కనిపిస్తాడు

మహేశ్ బాబు గత కొన్ని రోజుల క్రితమే కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం తన ఇంట్లోనే ఐసొలేట్ అయి ఉన్నారు. దీంతో ఆయన బయటకి రాలేని పరిస్థితి. అన్న మరణం మహేశ్ కి ఎంతో బాధని కలిగించింది. కరోనా వల్ల బయటకి రాకూడదు కాబట్టి రమేశ్ బాబుని కడసారి చూసేందుకు రాడనే తెలుస్తుంది. ఆయన అంతిమ కార్యక్రమాలకు హాజరుకాకపోవచ్చనే తెలుస్తుంది. దీంతో అన్నని మహేశ్ బాబు చివరి చూపు చూడకుండానే ఉండిపోవాల్సి వస్తుందని మహేశ్ బాధపడుతున్నట్టు సమాచారం. మహేశ్ భార్య నమ్రత మాత్రం వచ్చి నివాళులు అర్పించింది.