Mahesh Babu once again come to Balakrishna Unstoppable show for Guntur Kaaram promotions
Balakrishna – Mahesh Babu : బాలకృష్ణ హోస్టుగా చేస్తున్న అన్‌స్టాపబుల్ షో ఓటీటీ రంగంలో సరికొత్త రికార్డులని సృష్టిస్తూ ముందుకు దూసుకు పోతుంది. ప్రస్తుతం ఈ షో మూడో సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ రిలీజ్ కాగా మూడో ఎపిసోడ్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ మూడో ఎపిసోడ్ లో సుహాసిని, శ్రియా, జయంత్ సి పరాన్జీ, హరీష్ శంకర్ సందడి చేయబోతున్నారు. ఇది ఇలా ఉంటే, త్వరలో మహేష్ బాబుతో కూడా ఒక ఎపిసోడ్ ని ప్లాన్ చేశారట. మహేష్ బాబు ఆల్రెడీ ఒకసారి అన్‌స్టాపబుల్ కి గెస్ట్ వచ్చారు.
మొదటి సీజన్ కి గ్రాండ్ ఎండింగ్ ఇవ్వడానికి మహేష్ గెస్ట్ గా వచ్చారు. ఆ ఎపిసోడ్ అప్పటిలో రికార్డులు సృష్టించింది. ఇప్పుడు మహేష్ బాబు మరోసారి బాలయ్యతో బాతాఖానికి సిద్దమవుతున్నారట. మహేష్ ప్రస్తుతం ‘గుంటూరు కారం’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ సంక్రాంతి కానుకగా 2024 జనవరి 12న రిలీజ్ కాబోతుంది. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగానే మహేష్ అన్‌స్టాపబుల్ షోకి అతిథిగా రాబోతున్నారట. మహేష్ తో పాటు దర్శకుడు త్రివిక్రమ్ కూడా హాజరుకాబోతున్నారట.
Also read : Rana Daggubati : రానా బర్త్ డే స్పెషల్.. భల్లాలదేవ నుంచి రాక్షస రాజా హిరణ్యకశిపుడు వరకు..
ఈ సూపర్ ఎపిసోడ్ కి సంబంధించిన అప్డేట్ ని త్వరలోనే మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారట. ఇక ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈసారి ఎపిసోడ్ తో ఎలాంటి రికార్డులను సృష్టిస్తారో అని అభిమానుల్లో క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది. మరి ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. కాగా గుంటూరు కారం సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఆల్రెడీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మూవీ టీం.. ఒక్కో సాంగ్ రిలీజ్ చేసుకుంటూ వస్తుంది. నిన్న ఈ మూవీ నుంచి ‘ఓ మై బేబీ’ అనే సాంగ్ ని రిలీజ్ చేశారు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.