Rana Daggubati : రానా బర్త్ డే స్పెషల్.. భల్లాలదేవ నుంచి రాక్షస రాజా హిరణ్యకశిపుడు వరకు..
నేడు డిసెంబర్ 14న దగ్గుబాటి రానా పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ స్టోరీ. భల్లాలదేవ నుంచి రాక్షస రాజా హిరణ్యకశిపుడు వరకు..

Rana Daggubati birthday special story on his career movies
Rana Daggubati : ప్రస్తుతం ప్రపంచస్థాయికి ఎదుగుతున్న తెలుగు సినిమా పరిశ్రమకి ‘రానా దగ్గుబాటి’ అనే పేరు తప్పక కావాల్సి వస్తుంది. సౌత్ టు నార్త్ హీరోగా, విలన్‌గా, విజువల్ ఎఫెక్ట్స్ కో-ఆర్డినేటర్‌గా, టెలివిజన్ ప్రెజెంటర్‌గా, నిర్మాతగా సినిమా రంగానికి ఏ విధంగా సేవలు కావాలో ఆ విధంగా అందిస్తూ.. తనతో పాటు సినీ పరిశ్రమను కూడా ముందుకు తీసుకు వెళ్తున్నారు రానా దగ్గుబాటి. ‘కేరాఫ్ కంచరపాలెం’ వంటి మంచి సినిమాలు బయటకి రావాలంటే రానా కావాలి.
‘ఘాజీ’ వంటి అద్భుత సినిమాలను తెరకెక్కించే సంకల్ప్ రెడ్డి లాంటి దర్శకులకు గుర్తింపు కలగాలంటే రానా సహాయం కావాలి. ఆఖరికి ప్రభాస్ వంటి హీరో సినిమా ఇంటర్నేషనల్ వేదిక పైకి వెళ్ళడానికి కూడా రానా సహాయం కావాలంటే.. సినీ పరిశ్రమలో రానా స్థానం ఏంటో అర్ధం చేసుకోండి. బాహుబలి, కల్కి వంటి సరిహద్దులు చెరిపేసే సినిమాలకు రానా సహాయం తప్పక కావాల్సి వస్తుంది. ప్రస్తుతం కల్కి సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్ లో ప్రమోట్ చేసే భాద్యతని రానా తీసుకున్నట్లు తెలుస్తుంది.
ఇక నటుడిగా రానా కెరీర్ విషయానికి వస్తే.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లీడర్’ వంటి పొలిటికల్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ చేసి హీరోగా జర్నీ మొదలు పెట్టారు. టాలీవుడ్ లో హీరోగా నటిస్తూనే హిందీ సినిమాల్లో ముఖ్య పాత్రలు చేసి అక్కడ మంచి ఫేమ్ ని సంపాదించుకున్నారు. మాస్ హీరో కట్ అవుట్ కలిగి, స్టార్ ప్రొడ్యూసర్ కొడుకు అయ్యినప్పటికీ స్టార్ దర్శకులతో కమర్షియల్ సినిమాలు చేయకుండా.. కృష్ణం వందే జగద్గురుమ్, ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి వంటి వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు.
Also read : కల్కిలో ప్రభాస్ మూడు పాత్రలు..? పాస్ట్.. ప్రెజెంట్.. ఫ్యూచర్..!
హీరోగా ఎదుగుతున్న సమయంలో బాహుబలి సినిమాలో విలన్ చేసి పాత్రకే తన మొదటి ప్రాధాన్యత అని తెలియజేశారు. బాహుబలి సినిమాలో భల్లాలదేవగా రానా చూపించిన విలనిజం ప్రతిఒక్కరిలో కోపాన్ని కలిగించింది. ఆ పాత్రని రానా తప్ప మరొకరు పోషించలేరేమో అనిపించింది. భల్లాలదేవగా రాక్షసత్వం చూపించిన రానా.. త్వరలో రాక్షసరాజా హిరణ్యకశిపుడు పాత్రలో కనిపించబోతున్నారు.
ప్రస్తుతం రానా చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో గ్రే షేడ్ రోల్ చేసి సూపర్ హిట్ అందుకున్న రానా, తేజ కాంబినేషన్ ఇప్పుడు.. మరోసారి కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. నేడు డిసెంబర్ 14న రానా పుట్టినరోజు కావడంతో.. ఈ సినిమా అప్డేట్ ని ఇచ్చారు. ‘రాక్షస రాజా’ అనే టైటిల్ తో కొత్త సినిమాని అనౌన్స్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు.
అలాగే తాను హిరణ్యకశిపుడు పాత్రని పోషిస్తూ మైథాలజీ మూవీ ‘హిరణ్యకశ్యప’ని కూడా తెరకెక్కించబోతున్నారు. బాహుబలిలో భల్లాలదేవగా మెపించిన రానా.. హిరణ్యకశిపుడిగా ఎలా ఉంటాడో చూడడానికి ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ సినిమా పై భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే ఈ మూవీకి దర్శకుడు ఎవరు..? షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది..? అనేవి తెలియాల్సి ఉంది.