Mahesh babu : కోట్లిచ్చే బ్రాండ్స్‌కి మాత్రమే కాదు.. సేవ కోసం కూడా బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్..

మహేష్ ఓ NGO సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. Heal A Child అనే ఓ NGO సంస్థకు మహేష్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు.

Mahesh babu : కోట్లిచ్చే బ్రాండ్స్‌కి మాత్రమే కాదు.. సేవ కోసం కూడా బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్..

Mahesh Babu participated in Heal A Child NGO Program

Updated On : July 10, 2023 / 1:41 PM IST

Mahesh babu :  సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క యాడ్స్ కూడా బాగా చేస్తారని అందరికి తెలిసిందే. మహేష్ చేతిలో చాలా యాడ్స్ ఉన్నాయి. చాలా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఉన్నాడు. మహేష్ ఎక్కువగా యాడ్స్ చేయడానికి కారణం కూడా గతంలో తెలిపాడు. మహేష్ తన ఫౌండేషన్ ద్వారా పిల్లలకు ఉచిత హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తాడని తెలిసిందే. వాటికి అయ్యే ఖర్చు కోసమే మహేష్ ఎక్కువగా యాడ్స్ చేస్తాడు.

అయితే కోట్లిచ్చే యాడ్స్ అందరూ చేస్తారు. సెలబ్రిటీలంతా డబ్బుల కోసం యాడ్స్ చేస్తున్నారు. పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్నారు. కానీ సేవలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండమంటే తొందరగా ఎవరూ ముందుకు రారు. మహేష్ ఓ NGO సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. Heal A Child అనే ఓ NGO సంస్థకు మహేష్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఈ సంస్థ పేద పిల్లలకు, వైద్యం అవసరం ఉన్న పిల్లలకు వైద్యాన్ని అందిస్తుంది.

Mission Impossible : టామ్ క్రూజ్ మిషన్ ఇంపాజిబుల్ : డెడ్ రికనింగ్ పార్ట్ వన్ జులై 12న గ్రాండ్ రిలీజ్..

తాజాగా Heal A Child సంస్థ ఓ కార్యక్రమాన్ని నిర్వహించగా మహేష్ తన భార్య నమ్రత శిరోద్కర్ తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. దీంతో మరోసారి మహేష్ ని అభిమానులతో పాటు పలువురు నెటిజన్లు అభినందిస్తున్నారు. సేవ అంటే మహేష్ ఎప్పుడూ ముందు ఉంటాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.