Venky – Mahesh : పెద్దోడు పక్కన ఉంటే.. చాలా సరదాగా ఉంటుంది.. చిన్నోడు పోస్ట్ చూశారా..
పెద్దోడు పక్కన ఉంటే చాలా సరదాగా ఉంటుంది అంటూ మహేష్ బాబు చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.

Mahesh Babu post about Venkatesh gone viral
Venkatesh – Mahesh Babu : టాలీవుడ్ హీరోలు వెంకటేష్, మహేష్ బాబు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో పెద్దోడు, చిన్నోడుగా కనిపించి ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నారు. స్క్రీన్ పై అన్నదమ్ములుగా మంచి బాండింగ్ తో కనిపించిన వీరిద్దరూ బయట కూడా అదే బంధంతో కనిపిస్తుంటారు. తాజాగా ఈ ఇద్దరు ఒక ప్రైవేట్ పార్టీలో కనిపించరు. అక్కడ ఇద్దరు కలిసి సందడి చేశారు. ఆ పార్టీలో వెంకటేష్, మహేష్ బాబు పేకాడుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.
తాజాగా మహేష్ బాబు ఈ పార్టీ గురించి తన ఇన్‌స్టాగ్రామ్ లో ఒక పోస్టు వేసాడు. “పెద్దోడు పక్కన ఉంటే చాలా సరదాగా ఉంటుంది” అంటూ ఒక ఫోటో షేర్ చేశాడు. ఆ పిక్ లో వెంకీ అండ్ మహేష్ కలిసి కనిపిస్తున్నారు. ఫొటోలోని ఇద్దరి లుక్స్ కూడా ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వీరిద్దరి కాంబినేషన్ లో మళ్ళీ ఇంకో సినిమా వస్తే చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. మరి అది మళ్ళీ సెట్ అవుతుందో లేదో చూడాలి.
Also read : Anasuya : అనసూయ, అల్లు అర్జున్ పక్కన హీరోయిన్ ఛాన్స్ మిస్ చేసుకుందా..? ఏ మూవీ తెలుసా..?
ఇక ప్రస్తుతం ఈ ఇద్దరు చేస్తున్న సినిమాలు విషయానికి వస్తే.. వెంకటేష్ ‘సైంధవ్’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. శైలేష్ కొలను ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమాలో నటిస్తున్నాడు. త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు సంక్రాంతికే రాబోతున్నాయి. మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఇద్దరు హిట్ కొడతారా? లేదా ఒకరి పై ఒకరు విజయం సాధిస్తారా అనేది చూడాలి.