Mahesh Babu : ‘సర్కారు వారి పాట’ మూవీ పోస్టర్‌ని.. సితారతో రీ క్రియేట్ చేస్తున్న మహేష్ బాబు..
మహేష్ బాబు తన మూవీ 'సర్కారు వారి పాట' పోస్టర్‌ని సితారతో రీ క్రియేట్ చేస్తున్నారు.

Mahesh Babu re creating his movie poster with Sitara Ghattamaneni
Sitara Ghattamaneni : మహేష్ బాబు గారాల పట్టి సితార సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. తనకి సంబంధించిన విషయాలతో పాటు ఫ్యామిలీ ఫోటోలను కూడా షేర్ చేస్తుంటుంది. ఈక్రమంలోనే తన క్రేజీ డాడీ మహేష్ ని అభిమానులకు పరిచయం చేస్తూ.. వారిని ఖుషి చేస్తుంటుంది. తాజాగా ఈ ఘట్టమనేని వారసురాలు.. ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డే అంటూ కొన్ని ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేసింది.
ఈ పిక్స్ లో మహేష్ బాబు, నమ్రత, గౌతమ్ లతో పాటు మరికొందరు కజిన్స్ కూడా కనిపిస్తున్నారు. ఈ కజిన్స్ ఫొటోలోనే మహేష్ అన్నయ్య రమేష్ బాబు కూతురు భారతి కూడా కనిపిస్తుంది. అయితే ఈ పిక్స్ లో అందర్నీ ఆకట్టుకుంటున్న ఫోటో అంటే.. మహేష్ బాబు, సితార కలిసి ఉన్న ఫోటో. ఆ పిక్ లో మహేష్, సితార పోజ్ చూస్తుంటే.. ‘సర్కారు వారి పాట’ మూవీ పోస్టర్ గుర్తుకు వస్తుంది.
Also read : Kevvu karthik : క్యాన్సర్‌తో పోరాడుతున్న తన తల్లి కోలుకోవాలంటూ.. కెవ్వు కార్తీక్ ఎమోషనల్ పోస్టు..
ఆ మూవీలోని సూపర్ హిట్ సాంగ్ ‘కళావతి’లో.. మహేష్ అండ్ కీర్తి సురేష్ పోస్టర్ స్టిల్ ఒకటి ఉంటుంది. ఆ స్టిల్, ఇప్పుడు ఫొటోలో సితారతో ఉన్న స్టిల్ ఒకేలా కనిపిస్తుంది. దీంతో కొంతమంది ఫ్యాన్స్.. మహేష్ బాబు తన మూవీ పోస్టర్‌ని తన ముద్దుల కూతురు సితారతో రీ క్రియేట్ చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
ఇక మహేష్ బాబు విషయానికి వస్తే.. రాజమౌళి సినిమా కోసం సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. హాలీవుడ్ రేంజ్ లో రూపొందబోతున్న ఈ చిత్రం కోసం జక్కన్న పక్కా ప్రణాళికని సిద్ధం చేస్తున్నారు. ఈక్రమంలోనే కొన్ని సన్నివేశాలకు సంబంధించిన షాట్స్ ని ప్రీ విజువలైజేషన్ చేయిస్తున్నారు. ఈ ఏడాది మే నెలలో ఈ మూవీ పట్టాలు ఎక్కనుందని సమాచారం.