Kevvu karthik : క్యాన్సర్‌తో పోరాడుతున్న తన తల్లి కోలుకోవాలంటూ.. కెవ్వు కార్తీక్ ఎమోషనల్ పోస్టు..
క్యాన్సర్‌తో పోరాడుతున్న తన తల్లి కోలుకోవాలంటూ జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఎమోషనల్ పోస్టు వేశారు.

Jabardasth actor Kevvu karthik emotional post on his mother
Kevvu karthik : మిమిక్రితో కెరీర్ స్టార్ట్ చేసి జబర్దస్త్ తో మంచి కమెడియన్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు ‘కెవ్వు కార్తీక్’. ప్రస్తుతం కమెడియన్‌గా పలు టీవీ షోలు, సినిమాల్లో కనిపిస్తూ అలరిస్తూ వస్తున్నారు. ఇటీవలే పెళ్లి చేసుకొని ఒక కొత్త జీవితాన్ని కూడా మొదలు పెట్టారు. అయితే కార్తీక్ తన తల్లి విషయంలో గత కొంత కాలంగా బాధని అనుభవిస్తూ వస్తున్నారు.
కార్తీక్ తల్లి గత ఐదేళ్లుగా కాన్సర్ తో పోరాడుతూ వస్తున్నారు. 2019 మార్చి 19న ఆమెకు క్యాన్సర్ ఉన్నట్లు తెలిసిందట. ఇక అప్పటి నుంచి ఆ రోగం పై అలుపెరగని పోరాటం చేస్తూ వస్తున్నారట. ఈ ఐదేళ్లలో ఏన్నో సర్జరీలు, మరెన్నో కిమొథెరపీలతో పాటు ఎన్నో నిద్రలేని రాత్రులు, భరించలేని బాధలు పడినట్లు కార్తీక్ చెప్పుకొచ్చారు. ఇన్నాళ్లలో తమ పరిస్థితి అర్ధంకాని అగాధంలో పడ్డ భవిషత్తులా, చీకట్లో గమ్యం తెలియని ప్రయాణంలా ఉందని.. కానీ అన్నింటికీ తన తల్లి ఆత్మస్థైర్యమే సమాధానంగా నిలిచిందని పేర్కొన్నారు.
Also read : Rana Daggubati : బాలయ్య రికార్డులను బ్రేక్ చేయడానికి.. గట్టి ప్లాన్ వేస్తున్న రానా.. ఏంటో తెలుసా..!
క్యాన్సర్ పై అలుపెరుగని పోరాటం చేస్తున్న తన తాళి ఒక యోధురాలని కార్తీక్ గొప్పగా చెప్పుకొచ్చారు. ఇక తన తల్లి చేస్తున్న పోరాటానికి ధైర్యంగా నిలిచిన డాక్టర్స్ అందరికి తన పాదాభివందనాలు తెలియజేసారు. అలాగే తన తల్లి క్యాన్సర్ నుంచి కోలుకోవాలని కోరుకుంటూ.. తన బాధని వ్యక్తం చేసారు. ఇన్నాళ్ల నుంచి తన తల్లి చేస్తున్న పోరాటాన్ని ఒక వీడియోగా కార్తీక్ పోస్టు చేసారు. ఇక ఇది చూసిన నెటిజెన్స్.. ఆమె కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తూ.. కార్తీక్ ధైర్యం చెబుతున్నారు.
View this post on Instagram